పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం లో అవాస్తవ సంఘటనలు వాస్తవాలుగా చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో(సంతోషం టీవీ) ప్రచురించి ప్రజలను తప్పు త్రోవ పట్టించే ప్రయత్నంలో నిమగ్నమైన ఒక వ్యక్తి. నిన్న సాయంత్రం మక్కువ బైపాస్ రోడ్ లో స్కూల్ బస్సు మరమ్మత్తు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు క్లీనర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఇది తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం బాధితున్ని ఆసుపత్రికి తరలించి వైద్యం అందించడం జరిగింది. ఈ విషయాన్ని గమనించి ఒక వ్యక్తి సంబంధిత స్కూల్ పై మరియు యాజమాన్యంపై దుష్ప్రచారం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో (సంతోషం టీవీ) మరియు (ఆంధ్రపథం పత్రిక ? ) బాధితుడు యొక్క మాటలను తప్పుగా వక్రీకరించి ప్రచురించడం జరిగింది. ఈ సంఘటన జరిగి 12 గంటల తరువాత తప్పుగా చూపించటానికి గల కారణం స్కూల్ యాజమాన్యం సదరు వ్యక్తి చేసిన డిమాండ్ ను ఒప్పుకోక పోవటం వల్లనేనని గుసగుసలు వినిపిస్తున్నాయి





