కన్జ్యూమర్స్ యాక్టివిస్తుల విస్తృతస్థాయి సమావేశం

కన్జ్యూమర్స్ యాక్టివిస్తుల విస్తృతస్థాయి సమావేశం

సాలూరు పట్టణ వినియోగదారుల మండలి ఆధ్వర్యంలో కన్జ్యూమర్స్ యాక్టివిస్తుల విస్తృతస్థాయి సమావేశం జరిగినది. ఈ సమావేశంలో కన్జ్యూమర్స్ కు సంబంధించిన అనేక అంశములు చర్చించబడినవి. అదేవిధంగా వినియోగదారుల మండలి సభ్యులు సాలూరు శ్రీశ్రీశ్రీ శ్యామలంబ పండుగ సందర్భంగా చేసిన సేవలకు గాను విద్యుత్తు లైన్ మాన్ లో శ్రీ ప్రేమ్ కుమార్ గారిని శ్రీ రోహిణి కుమార్ గారిని  సన్మానం చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులను యాక్టివిస్టులను సత్కరించారు.  సాలూరులో ఏర్పడిన సమస్యలు
1. సాలూరు విశాఖపట్నం రైలు
2. సాలూరు అరకు బస్సు
3. సాలూరు రైతు బజారు వినియోగంలోకి తేవాలని
4. బాలికల జూనియర్ కాలేజీ ప్రాథమిక పనులన్నీ జరిగినందున కాలేజ్ మంజూరు చేయాలని
పై విషయాలు చర్చించి తీర్మానించడం జరిగింది
ఈ సమావేశమునకు విక్రమ్ సుదర్శన్ రావు గారు అధ్యక్షత వహించిరి. ప్రధాన కార్యదర్శి జిల్లెల్ల సీతారాం  ఉపాధ్యక్షులు బల్ల వేణుగోపాలరావు , కన్వీనర్ పురిపండ జగజీవన్ రావు , డాక్టర్ పి చక్రపాణి  ఉప్పల వెంకటేశ్వరరావు  పిల్ల మురళి  విక్రం రమణ మర్రి రాంప్రసాద్ రీనా పాడి  సుశాంత్ పాడి వి ఎల్ ఎన్ రాజుగారు తదితర కన్జ్యూమర్ యాక్టివిస్టులు .పాల్గొన్నారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి