సాలూరు నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి మంత్రి రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. 2009 నుంచి సాలూరు నియోజకవర్గం లో టిడిపి వరుసగా మూడుసార్లు అపజయం పాలయింది. అయినప్పటికీ ఆమె పార్టీ అభివృద్ధి కృషి చేస్తూ పార్టీ కార్యక్రమాలతోపాటు ప్రజా సమస్యలపై పోరాటాలు సాగించారు. పార్టీకి ఆమె చేస్తున్న సేవలను గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఆమెకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. వైకాపా ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి అరాచకాలను ఎండగడుతూ శాసనమండలిలో ప్రభుత్వాన్ని ఆమె ధైర్యంగా ప్రశ్నించారు. ఎన్నో అవమానాలు ఎదురైనప్పటికీ పార్టీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేశారు. పార్టీ కోసం ఆమె చేస్తున్న సేవలను గుర్తించి అరకు పార్లమెంట్ అధ్యక్షురాలిగా టిడిపి పొలిట్ బ్యూరో సభ్యురాలిగా అధిష్టానం పదవులు కట్టబెట్టింది. వీటి న్యాయం చేస్తూ అరకు పార్లమెంట్ లో బాగా వెనుకబడి ఉన్న తెదేపాను బలోపేతం చేసి సాధారణ ఎన్నికల్లో టిడిపి జనసేన అభ్యర్థుల విజయానికి కీలక పాత్ర వహించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో కురుపాం సాలూరు నియోజకవర్గం ఉన్నారు వీరిని దీటుగా ఎదుర్కొనేందుకు, పార్టీని మరింత పటిష్టపరిచేందుకు, ప్రస్తుతం జిల్లాలో బలమైన నాయకత్వం అవసరం ఉంది. గిరిజన మహిళ అయిన సంధ్యారాణికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే వైకాపాను దీటుగా ఎదుర్కోవడమే కాకుండా, అరకు పార్లమెంటుపై మంచిపట్టున్న నాయకురాలిగా మంచి పాలన అందిస్తుందని గిరిజన నియోజకవర్గ ఎమ్మెల్యేలు నాయకులు కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా ఆమెకు సముచిత స్థానం కల్పించి, మంత్రివర్గంలో చోటు దక్కిస్తామని పలుమార్లు మాటిచ్చారు. చంద్రబాబు కుటుంబ సభ్యులతో పాటు పార్టీ పెద్దలతో సత్సంబంధాలు కలిగి ఉన్న సంధ్యారాణికి ఈసారి మంత్రి పదవి ఖాయమని నియోజకవర్గ ప్రజలు కూడా ఆశిస్తున్నారు. గిరిజన ప్రాంత అభివృద్ధికి ఇప్పటివరకు అరకు పార్లమెంట్లో వెనుక కూడా ఉన్న తెదేపాను బలోపేతం చేసేందుకు సమతవంతమైన నాయకురాలు సంధ్యారాణికి మంత్రి పదవి ఇవ్వడం ఎంత మంచిదని ప్రజలు భావిస్తున్నారు మరికొద్ది గంటల్లో మంత్రివర్గ విస్తరణ జరగనుంది అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి.