*అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో మహిళా సాధికారిత వారోత్సవాలు*:   
స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో సోమవారం ఉదయం కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జె.బాల భాస్కరావు గారు అధ్యక్షతన మహిళా సాధికారత వారోత్సవాలు ప్రారంభమయ్యాయి.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్. రాఘవులు డిఎస్పి చీపురుపల్లి నుండి విచ్చేశారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సాధికారత వారోత్సవాలు 28.02.26 నుండి 08.03.26 జరుగుతాయని తెలిపారు.మహిళలు కుటుంబానికి మాత్రమే కాదు,దేశ అభివృద్ధికి కూడా మూలస్తంభాలు.విద్య,ఉద్యోగం,రాజకీయాలు,విజ్ఞానం,సాంకేతిక రంగాలలో వారు చూపుతున్న ప్రతిభ అందరికీ ప్రేరణగా నిలుస్తోందిని తెలియజేసారు.మరియు మహిళల హక్కులు మరియు సమానత్వంపై అవగాహన పెంచుకోవాలి కోరారు. ఈ కార్యక్రమానికి మరొ అతిథిగా జి.శంకర్రావు సి.ఐ,చీపురుపల్లి నుండి విచ్చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి అమ్మాయి తన సామర్థ్యాన్ని గుర్తించి,ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని తెలియజేశారు.మరియు ఈ కార్యక్రమానికి మరో అతిథిగా బి.లోకేశ్వరరావు ఎస్.ఐ,గరివిడి నుండి విచ్చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ వారోత్సవాల ద్వారా మహిళల హక్కులు,భద్రత,నాయకత్వ లక్షణాలు మరియు స్వయం సాధికారతపై అవగాహన పెంచుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా  మహిళా సాధికారత అనే అంశంపై విద్యార్థినిలకు డ్రాయింగ్,పెయింటింగ్,వ్యక్తృత్వ,వ్యాసరచన వంటి పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ బి.వెంకటరమణ,ఏఓ జి.అనిల్ కుమార్,విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి