పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం లో ఈరోజు వైసీపీ అభ్యర్థి పీడిక రాజన్న దొర మరో సెట్ నామినేషన్ వేసి అనంతరం శ్రీ శ్యామలాంబ కోవెల్లో ప్రత్యేక పూజలు చేసి అక్కడ నుంచి పట్టణ మెయిన్ రోడ్డు, పక్కన కోటవీధి, డబ్బివీది, మీదుగా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో వేలాది సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.