*పేదల ఆశల బడ్జెట్ పై విచక్షణా రహితంగా మాట్లాడుతున్నారు*

కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను చూసి వైసిపి నాయకులకు కళ్ళు తిరుగుతున్నాయి… అయ్యో ఇంతకు పూర్వమే ఇట్లాంటి బడ్జెట్ మనం ఇచ్చి ఉంటే ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితి మనకి వచ్చి ఉండేది కాదేమో అని మధనపడుతున్నారు..  అందుకే విచక్షణ రహితంగా మాట్లాడుతూ, బడ్జెట్ మీద కామెంట్ చేయాలి కదా అని సాకులు వెతుక్కుంటూ చేస్తున్న విమర్శలకు ప్రజలు ఛీ కొడుతున్నారు..

ఇంత అద్భుతమైన బడ్జెట్ ను మునుపెన్నడూ చూడలేదని అన్ని వర్గాల ప్రజల ఆశలను ఆకాంక్షలను ఈ బడ్జెట్ నెరవేరుస్తుందని ముఖ్యంగా మహిళలకు, గిరిజనులకు , రైతుల సంక్షేమ అభివృద్ధిలో పెద్దపీట వేసినందుకు ప్రజలంతా ముఖ్యమంత్రి కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు

రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ-భవిష్యత్తు కు ఈ బడ్జెట్ ఊపిరి.. ఇది గణాంకాల పుస్తకం కాదు. కోట్లాదిమంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే విజన్ డాక్యుమెంట్.. మాటల కోసం కాకుండా ప్రగతి కోసం ఏర్పాటు చేసిన బడ్జెట్ ఇది.

రాష్ట్ర భవిష్యతు స్పష్టమైన దశను, దిశను చూపే విధంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది.

ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ను కూటమి ప్రభుత్వం రూపొందించడం జరిగింది.

ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు వచ్చేలా ఈ బడ్జెట్ ఉంది.

బడుగు బలహీనవర్గాల అభివృద్ధే లక్ష్యంగా వ్యవసాయం, పారిశ్రామిక, సాగునీటి, విద్య, వైద్యం, టూరిజం, పంచాయతీరాజ్, మహిళా సంక్షేమం రంగాలను బలోపేతం చేసే విధంగా ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రాధాన్యత ఇచ్చింది.

అన్ని వర్గాల సమగ్రాభివృద్దే లక్ష్యంగా రూ.3,32,205 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ఆర్థిక శాఖామంత్రి గారిని అభినందిస్తున్నాం.

రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ఎన్నడూలేని విధంగా మూలధన వ్యయానికి రూ.53,915 కోట్లు కేటాయించడం. అభినందనీయం.

వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.13,598 కోట్లు కేటాయించడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి అద్దం పడుతుంది.

గత ఏడాది బడ్జెట్లో రూ.300 కేటాయించి మామిడి, ఉల్లి, కోకో, పొగాకు రైతులకు కేటాయింపులకు మించి రూ.1200 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి కింద ఆదుకోవడం జరిగింది. ఈ ఏడాది కూడా రూ.500 కోట్లు కేటాయించి రైతులకు అండగా నిలబడడం జరిగింది.

గత ప్రభుత్వం అయిదేళ్లలో ధరల స్థిరీకరణకు ఖర్చు చేసింది రూ.880 కోట్లు మాత్రమే.

సాగునీటి ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది.

ఈ ఏడాది బడ్జెట్లో రూ.18,224 కోట్లు కేటాయించడం జరిగింది. గత ఏడాదితో పోల్చుకుంటే రూ.4 వేల కోట్లు అధికంగా కేటాయించడం జరిగింది.

పేదవారి సొంత ఇంటి కల నెరవేర్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. గత ఏడాది బడ్జెట్లో రూ.2 వేల కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది రూ.6,357 కోట్లు కేటాయించడం జరిగింది.


సంక్షేమానికి గత ఏడాది రూ.41,726 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ.53,190 కోట్లు కేటాయించడం జరిగింది. అన్నివర్గాల సమగ్ర సంక్షేమానికి పునాది వేసేలా నిధులు కేటాయించడం జరిగింది.

బీసీల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రూ.51,021 కోట్లు…

ఎస్సీ సంక్షేమం కోసం రూ.20,644 కోట్లు…

ఎస్టీ సంక్షేమం కోసం రూ.9,190 కోట్లు…

మైనారిటీ సంక్షేమం కోసం రూ.6,090 కోట్లు…

మహిళ, శిశు, వికలాంగుల సంక్షేమానికి రూ.4,582 కోట్లు…

మొత్తం సంక్షేమానికి రూ.91,527 కోట్లు కేటాయించడం జరిగింది. గతంలో ఏ ప్రభుత్వం ఇంత భాష సంక్షేమానికి నిధులు కేటాయించిన దాఖలాలు లేవు.

ఈడబ్ల్యూఎస్ సంక్షేమానికి రూ.10,669 కోట్లు కేటాయించారు.

సాంఘిక సంక్షేమానికి రూ.11,118 కోట్లు కేటాయించారు.

పాఠశాల విద్యకు రూ.32,308 కోట్లు కేటాయించడం విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత అద్దం పడుతుంది.

మౌలిక వసతుల కల్పనకు రూ. 1500 కోట్లు, ఉన్నత విద్యకు రూ.2,567 కోట్లు, నైపుణ్యాభివృద్ధికి రూ.1,232 కోట్లు కేటాయించడమైంది.

ఎన్టీఆర్ భరోసా పింఛన్ కు రూ.27,719 కోట్లు కేటాయించారు.

పంచాయితీరాజ్ శాఖకు రూ.22,942 కోట్లు కేటాయించడమైనది.

వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ రూ.11 వేల కోట్లు ప్రభుత్వమే ఇస్తుంది.

ఆక్వా సబ్సిడీగా రూ.890 కోట్లు ఖర్చు చేసింది.

గృహనిర్మాణ శాఖకు రూ.6,357 కోట్లు కేటాయించడమైనది.

వైద్యశాఖకు రూ.19,306 కోట్లు కేటాయించడమైనది.

పౌరసరఫరాలకు రూ.3,821 కోట్లు కేటాయించడమైనది.

ఆరోగ్య రంగానికి రూ.19,306 కోట్లు కేటాయించారు.

పురపాలక శాఖకు రూ.14,538 కోట్లు కేటాయించారు.

అన్నదాత సుఖీభవ పథకానికి రూ.6600 కోట్లు కేటాయించారు.

గత ప్రభుత్వం 12.3% వడ్డీతో అప్పులు చేయగా, కూటమి ప్రభుత్వం దానిని 9%కు తగ్గించడం జరిగింది.

కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు 20 లక్షల నుండి 45 లక్షల వరకు ఉచిత బీమా కవరేజ్ కల్పించే గ్రూప్ పర్సనల్ యాక్సిడెట్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రారంభించాం.

కోర్టు భవనాలు, నివాస గృహాల నిర్మాణానికి, న్యాయ వ్యవస్థకు రూ.349 కోట్లు కేటాయించడమైనది. 100 కొత్త కోర్టులను కూడా ఆమోదించడమైనది.

మున్సిపల్ పట్టణాభివృద్ధికి రూ.14,539 కోట్లు కేటాయించడమైనది.

కూటమి ప్రభుత్వం వివిధ కేటగిరిల్లో 30,607 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది.

కార్మిక శాఖకు రూ.735 కోట్లు కేటాయించడం జరిగింది.

విద్యుత్ రంగానికి రూ.13,934 కోట్లు కేటాయించారు.

*స్పష్టమైన లక్ష్యం*

ప్రతి ఏడాదికి మార్పు వచ్చేలా అన్ని రంగాలలో గణనీయమైన అభివృద్ధి చోటుచేసుకునేలా బలహీనవర్గాల జీవన ప్రమాణాల్లో మార్పు జరిగేలా బడ్జెట్ను రూపొందించడం జరిగింది.

విజన్ 2047 లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.

ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ వ్యవసాయం, సాగునీటి రంగం, విద్య, వైద్య రంగాలను బలోపేతం చేస్తూ యువతకు ఉపాధినిచ్చే పెట్టుబడులను ఆకర్షిస్తూ బడ్జెట్ రూపొందించిన ప్రభుత్వాన్ని మరోసారి అభినందిస్తున్నా.

ఈ బడ్జెట్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు దోహదపడుతుంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి