వైఎస్సార్ – తెలుగు ప్రజల గుండె చప్పుడు

వైఎస్సార్ – తెలుగు ప్రజల గుండె చప్పుడు

వైఎస్సార్ – తెలుగు ప్రజల గుండె చప్పుడు
                                 
_*అభివృద్ధి, సంక్షేమ పథకాలకు దిక్సూచిగా నిలిచిన మహానేతకు ఘన నివాళి.*_

_*- ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను).*_*ex ఎంపీ PAC మెంబర్ బెల్లాన చంద్రశేఖర్*
చీపురుపల్లి పట్టణం మండల ఆఫీస్ ఆవరణలో దివంగత నేత ప్రజల గుండెల్లో చిరస్తాయిగా నిలిచిన దేవుడు స్వర్గీయ వై యస్ రాజశేఖర్ రెడ్డి గారికి 16 వ వర్ధంతి సందర్బంగా ఘనంగా నివాళులు అర్పించిన విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గారు, ex ఎంపీ PAC మెంబర్ బెల్లాన చంద్రశేఖర్ గారు

         ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలుగు ప్రజల గుండె చప్పుడు,అభివృద్ధికి నడకలు నేర్పిన నేత,రాష్ట్ర చరిత్ర దశ దిశ మార్చిన మహానాయకుడు డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), ex ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. మహానేత భౌతికంగా మన మధ్య లేకపోయినా,ఆయన చూపిన మార్గం,అమలు చేసిన సంక్షేమ పథకాలు నేటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108, 104, ఇళ్ల పంపిణీ, ఉచిత విద్యుత్, రైతు రుణ మాఫీ,ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలు లక్షలాది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయని చిన్న శ్రీను గుర్తుచేశారు. నీటి ప్రాజెక్టుల పరంగా వైఎస్ఆర్ చేసిన కృషి అమోఘమని,మన ప్రాంతానికి తోటపల్లి ప్రాజెక్టులు ఆయన చొరవతోనే నిర్మితమయ్యాయని తెలిపారు. ఉత్తరాంధ్ర వాసులపై వైఎస్సార్‌కు ప్రత్యేక మమకారం ఉండేదని, నియోజకవర్గం ప్రజలకు దాహార్తిని తీర్చే విధంగా చేపట్టిన నీటి పథకాలు,పలు ప్రభుత్వ విద్యాసంస్థలు అభివృద్ధికి చిరునామాగా నిలిచాయని ఆయన గుర్తు చేశారు. రైతును రాజుగా చేసిన నాయకుడు వైఎస్ఆర్. పేదలకి దేవుడులాంటి వారని,అపర భగీరథుడిగా ప్రజల మనసుల్లో నిలిచిపోయారన్నారు. వైద్యం,విద్య, వ్యవసాయం, పేదల అభివృద్ధికి ఆయన చేసిన కృషి దేశానికే ఆదర్శంగా నిలిచిందని, వైఎస్ఆర్ పాలన నిజమైన స్వర్ణయుగం అని కొనియాడారు.అర్హులందరికీ గృహాలను అందించి పూరి గుడిసె లేకుండా చేసిన ఘనత మహానేతకే చెందుతుందని చెప్పారు. వైఎస్ఆర్ భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన వేసిన అభివృద్ధి అడుగులు నేటికీ స్ఫూర్తిగా నిలుస్తున్నా యన్నారు. మహానేత 16వ వర్థంతి సందర్భంగా మనమందరం ఆయన సేవలను స్మరించుకుంటూ అతను చూపిన బాటలో నడవాలని కోరారు, ఈ కార్యక్రమం లో జిల్లా వైస్సార్ పార్టీ జనరల్ సెక్రటరీ ఇప్పిలి అనంతం,జిల్లా పబ్లిసిటీ వింగ్ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు,మండల వైస్సార్ పార్టీ అధ్యక్షులు మీసాల వరహాలనాయుడు, యువజన నాయకులు బెల్లానవంశీ, వైస్సార్ పార్టీ నాయకులు కరిమజ్జి శ్రీనివాసరావు,పతివాడరాజారావు, ధన్నాన జనార్దనరావు,బెల్లాన త్రినాధరావు,కొంచాడ శ్రీనివాసకుమార్,సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, వార్డ్ మెంబెర్స్, నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని రాజశేఖర్ రెడ్డి గారికి నివాళులు అర్పించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి