విలేకరి పై దాడిని ఖండించిన జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విజయనగరం, ఫిబ్రవరి 17 : మక్కువ ప్రజాశక్తి విలేఖరి రామారావుపై టిడిపి నాయకుడి దాడిని జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైకాపా జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ మజ్జి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య మనుగడకు మూలాధారమైన పత్రికా వ్యవస్థపై దాడి సమంజసం కాదని అన్నారు. వ్యతిరేక వార్తలు రాసినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా దానికి వివరణ ఇవ్వాలని, లేదా ప్రకటన ద్వారా ఖండించాలి తప్ప, భౌతిక దాడులు సరైన మార్గం కాదని అన్నారు. ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు వంటివని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు బాధిత పాత్రికేయులకు అన్ని విధాల అండగా నిలుస్తామని ఆయన ప్రకటించారు. .. Spread the love టపా నావిగేషన్ విలేకరులపై దాడులను ఖండిస్తూ నిరసన సాలూరు ప్రభుత్వ హాస్పిటల్ ముందు సెక్యూరిటీ గార్డ్స్ మరియు శానిటేషన్ వర్కర్స్ తో ఎఫ్ ఆర్ ఎస్ యాప్ ను రద్దు చేయాలని నిరసన కార్యక్రమం