ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవత,కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా విశ్వాసం చూరగొన్న కల్పవల్లి మక్కువ మండలం,శంబర గ్రామంలోనున్న *శ్రీశ్రీశ్రీ పోలమాంబ అమ్మవారి* ని *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం&మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక.రాజన్నదొర* దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ ఈవో బి.శ్రీనివాస్ రావు స్వాగతించి దుస్సాలువాతో సత్కరించారు.రాష్ట్ర ప్రజలందరిపై పోలమాంబ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించానన్నారు.ఈ కార్యక్రమంలో శంబర గ్రామ వైస్ ప్రెసిడెంట్ అల్లు.వెంకటరమణ ,సాలూరు పట్టణ వైసిపి నాయకులు జర్జాపు.శ్రీను పాంచాలి వైసిపి నాయకులు ముదారపు శ్రీనివాసరావు , గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.




