ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవానికి భారీ బందోబస్తు విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, ఐపిఎస్*

🫟 *దాదాపు 7,000 మంది పోలీసులతో సెక్యూరిటీ ఏర్పాటు చేశామన్న జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్,ఐపీఎస్*

🫟 *వాహనదారులకు సూచించిన మార్గాల్లోనే పార్కింగ్ స్థలాలకు చేరుకోవాలన్న జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, ఐపీఎస్*

🫟 *ప్రజలు పోలీసులకు సహకరించి, పోలీసు వారి సూచనలు పాటించాలన్న జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, ఐపీఎస్*

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం పండుగ వాతావరణంలో, అత్యంత ప్రశాంతంగా జరిగేలా దాదాపు 7,000 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఏఆర్ దామోదర్ జూలై 30న తెలిపారు.

జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ – విమానాశ్రయ ప్రాంతాన్ని ప్రధానంగా 13 విభాగాలుగా విభజించాలని, వాటిని 89 సెక్టార్లుగా చేసి, ప్రతి సెక్టార్‌కూ 80 నుంచి 100 మంది సిబ్బందిని కేటాయించారు. ఈ బందోబస్తు విధుల కోసం రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి బలగాలను రప్పించగా, వారిలో 30 మంది ఐపీఎస్ అధికారులతో పాటు డీజీ, ఏడీజీ, ఐజీ, డీఐజీ, ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారన్నారు.
సభా ప్రాంగణం, ఎయిర్‌పోర్ట్ జోన్, రూట్ బందోబస్తు, పార్కింగ్ ప్రాంతాలను ప్రత్యేక బృందాలు పర్యవేక్షిస్తున్నాయని, ఔటర్ పెరిఫెరల్ ప్రాంతాల్లో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ దళాలు, మెటల్ డిటెక్టర్లతో కూడిన క్రైమ్ టీమ్స్ వారం రోజుల నుంచే తనిఖీలు చేపట్టాయని జిల్లా ఎస్పీ తెలిపారు.

నేరాలు జరగకుండా ప్రత్యేకంగా పోలీసు సిబ్బందిని నియమించామని, డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు ఇప్పటికే సభ, ఎయిర్ పోర్ట్ ప్రాంగణంను క్షుణ్ణంగా తనిఖీలు చేశాయన్నారు. ఎయిర్ పోర్ట్ చుట్టూ ఉన్న ప్రాంతాలను, గ్రామాలను సందర్శించి పూర్తి పట్టు సాధించామన్నారు. ప్రధాని సభలో ప్రముఖులు పాల్గొననున్న కారణంగా భద్రత కట్టుదిట్టం చేసి, నాలుగంచెల పోలీసు భద్రతను ఏర్పాటు చేశామన్నారు. సభకు వచ్చే ప్రజలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతనే సభ ప్రాంగణంలోకి అనుమతిస్తామని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు.

*ప్రజా రవాణా, పార్కింగ్ ఏర్పాట్లు:*

ప్రధాని సభకు దాదాపు 3 లక్షల మంది ప్రజలు, 5,000 బస్సులు, ద్విచక్ర వాహనాలతో సహా 7,000 వరకు విఐపి, ఇతర ప్రైవేటు వాహనాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు.

🫟 *విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం వైపు నుంచి వచ్చే వాహనాలు:* జాతీయ రహదారి-16 పైన ఆనందపురం జంక్షన్ మీదుగా రాజాపులోవ జంక్షన్‌కు చేరుకుని, అక్కడ కొత్తగా నిర్మించిన ట్రంపెట్ బ్రిడ్జ్ వద్ద కుడివైపునకు మళ్లి పార్కింగ్ స్థలాలకు వెళ్లాల్సి ఉంటుంది.

🫟 *శ్రీకాకుళం, రాజాం, చీపురుపల్లి, నెల్లిమర్ల, ఒడిశా వైపు నుంచి వచ్చే వాహనాలు:* జాతీయ రహదారి-16 మీదుగా వచ్చి భోగాపురం పరిధిలోని ముంజేరు జంక్షన్ లేదా కంచేరు-రావివలస జంక్షన్ల వద్ద సర్వీస్ రోడ్డులోకి మళ్లి పార్కింగ్ ప్రదేశాలకు చేరుకోవాలన్నారు.

🫟 *వీఐపీ వాహనాలకు:* ప్రధాని సభలో పాల్గొనేందుకు వచ్చే విఐపిల వాహనాలు నేరుగా వీఐపీ పార్కింగ్ కు చేరే విధంగా సవరవల్లి జంక్షన్ నుండి సన్ రే రిసార్ట్స్ సర్వీస్ గేటు మీదుగా ఎయిర్ పోర్టు ప్రాంతంలోకి చేరుకొనే విధంగా రహదారిని ఏర్పాటు చేసినట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు.

సభా ప్రాంగణానికి కేవలం 400 నుంచి 600 మీటర్ల దూరంలోనే అన్ని వాహనాలకు పార్కింగ్ వసతి కల్పించామన్నారు. మార్గమధ్యంలో వాహనాలు నిలిపివేస్తే వెనుక వచ్చే వాహనాలకు తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉన్నందున ప్రతిఒక్కరూ కేటాయించిన పార్కింగ్ ప్రాంతాల్లోనే వాహనాలను నిలపాలని సూచించారు. జాతీయ రహదారిపై సభకు వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా పార్కింగ్ స్థలాలకు చేరుకొనేలా ఎక్కడికక్కడ సూచిక బోర్డులను ఏర్పాటు చేశామన్నారు. వాహనదారులు సూచికలను గమనించి, పోలీసుల సూచనలు పాటించాలని కోరారు.

*అత్యవసర సర్వీసులు, నిబంధనలు:*
*నో ఫ్లైయింగ్ జోన్: ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతాల్లో 5 కిలోమీటర్ల పరిధిలో 48 గంటల పాటు ‘నో ఫ్లైయింగ్ జోన్’ ప్రకటించారు. డీజీసీఏ అనుమతి లేకుండా ప్రైవేట్ వ్యక్తులు గానీ, ప్రభుత్వ అధికారులు గానీ డ్రోన్లు ఎగరవేస్తే వాటిని జప్తు చేసి, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు.

అత్యవసర ప్రయాణాలు వాయిదా: ఆ రోజు జాతీయ రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుందున, అత్యవసరం అయితే తప్ప సాధారణ ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

*మెడికల్ క్యాంపులు, అంబులెన్సులు:* ఎమర్జెన్సీ పరిస్థితుల ఎదురైతే తక్షణ వైద్యం అందించేందుకు పలుచోట్ల మెడికల్ క్యాంపులు, అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు. ఆసుపత్రులకు తరలించేందుకు ప్రత్యేకంగా ఒక కారిడార్‌ను ఖాళీగా ఉంచినట్లుగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి