ఈ ప్రాంత ప్రజలపై ఉన్న అభిమానంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2023 మే 3 న శంకుస్థాపన చేసి భోగాపురం ఎయిర్ పోర్ట్ కి నాంది పలికారు ఈ ప్రాంత మత్స్యకారుల కష్టాలు తొలగించాలని జగన్ మూలపేట ఎయిర్ పోర్ట్ కి శ్రీకారం చుట్టారు.. ఉత్తరాంధ్ర ఆర్ధిక అభివృద్ధి వైఎస్ జగన్ కళ.. నేడు ప్రధాని మోదీ చేతుల మీదుగా ఎయిర్ పోర్ట్ ప్రారంభిస్తుండటం చాలా ఆనందకరం.. జీఎంఆర్ సంస్థ అధినేత మల్లికార్జున రావుకు ధన్యవాదములు.. చెప్పిన సమయానికే ఎయిర్ పోర్ట్ జీఎంఆర్ పూర్తి చేయడం ఈ ప్రాంత వాసులుగా గర్వకారణం.. కోట్ల ఖరీదు చేసే భూములు త్యాగం చేసిన రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు.. ఆ ప్రాంతంలో 404 కుటుంబాలకు పునరావాసం కల్పించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే చేయని పనిని…చేసామంటూ చెప్పుకుంటోంది ప్రస్తుత కూటమి ప్రభుత్వం జీఎంఆర్ సంస్థతో ఎంవోయూ చేసింది నాటి జగన్ ప్రభుత్వం ఆనాడే అభివృద్ధి పనుల కోసం మౌళిక సదుపాయాలకు రూ.135 కోట్లు రిలీజ్ చేసిన ఘనత జగన్ దే.. విమానాశ్రయం చుట్టూ 14 కిలోమీటర్లు కాంపౌండ్ వాల్ నిర్మాణం, కాలువలు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసాం.. జూన్ 12 2020న ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ జి ఎం ఆర్ సంస్థ ఎయిర్ పోర్ట్ కి ఎంఓయు చేసుకుంది.. కాంపౌండ్ వాల్ తర్వాతే మే 3, 2023 న ఎయిర్పోర్ట్ కు వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు.. కానీ, నాడు 2019 ఫిబ్రవరిలో టీడీపీ ప్రభుత్వం చేసిన శంకుస్థాపన విషయం పీఎంవోకు పంపిన అధికారిక నోట్ లో ఎందుకు లేదు.. అంటే నాడు టీడీపీ శంకుస్థాపన ఎన్నికల ముందు ప్రజలను తప్పుదోవ పట్టించడానికే.. రెండేళ్లలో ఒకటి అరా తప్ప రైతులకు కూటమి ప్రభుత్వం భూపరిహారం ఇచ్చిన దాఖలాలు లేవు.. కానీ రూ. 890 కోట్లు భూ సేకరణ కోసం ఖర్చు చేసినట్టు పిఎంఓ కి ఇచ్చిన అధికారిక నోట్ లో ఎలా పేర్కొన్నారు.. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే రైతులకు పరిహారం చెల్లించి, కోర్ట్ కేసుల అడ్డంకులను తొలగించాం.. నాడు ఏ ఒక్క రైతు నుంచి నిర్మాణ పనులకు వ్యతిరేకత ఎదురు కాలేదు.. అయితే నేటికీ పెండింగ్ లో ఉన్న కొద్దిపాటి పరిహారాన్ని కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు.. పరిహారం అడిగిన రైతును జేసీబీ బకెట్ తో పక్కన పడేసారు.. కూటమి ప్రభుత్వానికి ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో కాంట్రిబ్యూషన్ ఏముంది..? ఎవియేషన్ మంత్రిగా రామ్మోహన్ నాయుడు విమానాలు దిగేందుకు అనుమతులు తప్పితే సౌకర్యాలు కల్పనలో చిత్తశుద్ధి ఎక్కడ.. ఫోటోలు, రీల్స్ చేసుకోవడం తప్ప ఈ ప్రభుత్వం ఒక్క కంట్రిబ్యూషన్ కూడా చేయలేదు ఎయిర్ పోర్ట్ క్రెడిట్ చోరీ, వైఎస్ జగన్ ట్విట్ పై మంత్రులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం ఎయిర్పోర్ట్ పూర్తిస్థాయిలో నిర్మించింది ఘనత నాటి వైసీపీ ప్రభుత్వానిదే భోగాపురం ఎయిర్పోర్ట్‌కు వైఎస్. జగన్ 2023 మే 3న ఫౌండేషన్ స్టోన్ వేశారు.. 2026 జూన్ చివరికి భోగాపురం ఎయిర్పోర్ట్ కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభమవుతాయని ఆనాడే వైయస్. జగన్ చెప్పారు. ఎయిర్పోర్ట్‌కు కావలసిన భూమి సేకరణ అంతా వైయస్. జగన్ ప్రభుత్వంలోనే పూర్తయింది కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ల నుంచి రావాల్సిన ఎన్ఓసిలన్నీ వైయస్. జగన్ హయాంలోనే వచ్చాయి కన్సస్ట్రక్చన్ అగ్రిమెంట్ పూర్తి చేసి నిధులు కేటాయించిన తర్వాతే వైయస్.జగన్ శంకుస్థాపన చేశారు. ప్రైవేట్ పెట్టుబడిదారి ఫైనాన్షియల్ క్లోజర్ చేసిన తర్వాతే వైయస్. జగన్ పునాది రాయి వేశారు ఆనాడు వైయస్.జగన్ చెప్పినట్టుగానే జూన్ 2026 నాటికి ఎయిర్పోర్ట్ పనులు పూర్తయ్యాయి భోగాపురం ఎయిర్పోర్ట్‌ను ప్రధానమంత్రి ప్రారంభించడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోంది.. ఉత్తరాంధ్రలోని మూడు పాత జిల్లాలకు టీడీపీ ప్రభుత్వం ఎలాంటి ప్రయోజనకరమైన పని చేయలేదు ఎయిర్ పోర్టుకు ఏ టు జెడ్ అనుమతులన్నీ తెచ్చింది ఒక్క వైఎస్ జగన్ మాత్రమే 2015 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో ఎయిర్పోర్ట్ ఏ ఫార్మాలిటీ కూడా పూర్తి కాలేదు భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం వైయస్.జగన్ ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలు వెచ్చించింది నీటి సరఫరా కోసం రూ. 75 కోట్లు మరియు ఇతర అవసరాలకు రూ. 135 కోట్లు వైయస్.జగన్ ప్రభుత్వమే ఇచ్చింది రీహాబిటేషన్, సెటిల్మెంట్ మరియు కనెక్టింగ్ రోడ్లకు నిధులు వైయస్.జగన్ హయాంలోనే ఇచ్చాం విశాఖ నగరం నుండి ఎయిర్పోర్ట్‌కు వెళ్లే రోడ్డు కోసం జగన్ కేంద్రంతో మాట్లాడి రూ. 7వేల కోట్లు మంజూరు చేయిస్తే దానిపై చిత్త శుద్ధి చూపలేదు.. కూటమి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలైనా సిటీ కనెక్టివిటీ రోడ్డు పనులు ముందుకు సాగలేదు.. కనెక్టివిటీ రోడ్డు నిర్మించకపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడతారు.. ఉత్తరాంధ్రలో వైయస్. జగన్ ప్రారంభించిన అభివృద్ధి ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం పక్కన పడేసింది.. ఈ ప్రాంత అభివృద్ధికి వైఎస్ జగన్ కున్న చిత్తశుద్ధికి తార్కణమే నిన్నటి రోజున అయన కోసం వచ్చిన జనసందోహం నిదర్శనం.. Spread the love టపా నావిగేషన్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి భారీ బందోబస్తు విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, ఐపిఎస్