విజయనగరం జిల్లా …
గరివిడి మండలం  అర్తమూరు పంచాయతీ పరిధిలో గల రామతులసి మిల్లులో తనికీలు,
పిడిఎఫ్ బియ్యం నిల్వలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ కి పిర్యాదు నేపద్యంలో, పక్కా సమాచారంతో జిల్లా  కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి ఆదేశాలు మేరకు జిల్లా విజిలెన్స్ అధికారులు పౌరసరఫరా శాఖ డిప్యూటీ కలెక్టర్ అరుణ కుమారి ఆధ్వర్యంలో ఉప తహసిల్దార్
లతో మిల్లు తనికీలు చేపట్టారు.మిల్లు సిబ్బందికి తనిఖీ అధికారులు పలు ప్రశ్నలు వేసిన పరిస్థితి,
తూనికా,యంత్రాలు, బియ్యం నిల్వలు తనిఖీలు చేశారు . తనికీలలో ఎటువంటి అక్రమ నిల్వలు లేవని,పిడిఎఫ్ బియ్యం నిల్వలు లేవని విజిలెన్స్ అధికారులు స్పష్టం చేశారు.ఈ మేరకు సివిల్ సప్లై  డిప్యూటీ కలెక్టర్ అరుణ కుమారి మిల్లును తనకి చేశామని ఎటువంటి  అక్రమ బియ్యం నిల్వలు లేవని వివరించారు.పక్కా సమాచారంతో వెళ్ళిన ప్రభుత్వ అధికారులకు 100 గ్రాముల పిడిఎఫ్ బియ్యం దొరకకపోవడం గమనార్హం. గతంలో ఇదే మిల్లు పై అవినీతి ఆరోపణల నేపద్యంలో కొందరు కలెక్టర్ కి పిర్యాదు నేపద్యంలో తనిఖీలు చేశామని
వివరించారు.నివేదకను జిల్లా కలెక్టర్ గారికి  సమర్పిస్తామని ఆమె స్పష్టం చేశారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి