కమాండ్ కంట్రోల్ రూంను పరిశీలించిన జిల్లా ఎస్పీ*



*కమాండ్ కంట్రోల్ రూంను పరిశీలించిన జిల్లా ఎస్పీ*

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ రూంను జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారు సెప్టెంబరు 26న సందర్శించి, జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలు, ముఖ్య కూడళ్ళలో ఏర్పాటు
చేసిన సిసి కెమెరాల పనితీరును పరిశీలించారు.

జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ కమాండ్ కంట్రోల్ రూంను సందర్శించి, జిల్లాలో వివిధ ప్రాంతాలు, రహదారి కూడళ్ళ వద్ద ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను, వాటి లైవ్ వీడియోలను పరిశీలించారు. రహదారి ప్రమాదాలు, దొంగతనాలు జరిగినపుడు వాహనాలను కంట్రోల్ రూం నుండి ఏవిధంగా ట్రాక్ చేయవచ్చును, సిసి ఫుటేజులను, సిసికెమెరాల పర్యవేక్షణలో ఉన్న ప్రాంతాలను, ప్రత్యక్షంగా జరుగుతున్న ధర్నాలను, సంఘటనలను కమాండ్ కంట్రోల్  రూం నుండే ఎలా పర్యవేక్షించవచ్చును అన్న అంశాలను జిల్లా ఎస్పీ పరిశీలించారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఎన్ని సిసి కెమెరాలు ఉన్నవి, వాటిలో ఎన్ని సక్రమంగా పని చేస్తున్నవని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇంకనూ పని చేయని సిసి కెమెరాలను వెంటనే మరమత్తు చేయాలని, టెక్నికల్ లోపాలను సరిచేసి, సక్రమంగా పని చేసే విధంగాచర్యలు చేపట్టాలని ఆదేశించారు. సిగ్నల్ పాయింట్ల వద్ద ఎం.వి. నిబంధనలు పాటించకుండా సిగ్నల్ జంపింగుకు పాల్పడుతున్న వాహనదారులపై ఆటోమేటిక్ గా ఈ-చలానా జనరేట్ అవుతాయని, నిబంధనలు అతిక్రమించినట్లుగా రుజువు చేస్తూ అందుకు సంబంధించిన సాక్ష్యాలుగా సిసి కెమెరాల్లో ఫోటోలుగా నిక్షిప్తమవుతాయని కమాండ్ కంట్రోల్రూం సిబ్బంది, ఆర్.టి.జి. సిబ్బంది జిల్లా ఎస్పీకు వివరించారు. కమాండ్ కంట్రోల్ రూంను మరింతగా విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నామని, త్వరలో మరిన్ని సిసి కెమెరాలను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసి, పెద్ద స్క్రీన్లకు అనుసంధానం చేసి, కమాండ్ కంట్రోల్ రూం నుండి పర్యవేక్షించే విధంగాను, అన్ని ప్రాంతాలపై నిఘా ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సిఐ ఎవి లీలారావు, ఇతర అధికారులు మరియు కమాండ్ కంట్రోల్ రూంసిబ్బంది పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *