జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ మరియు ఇతర అధికారులతో భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించిన విశాఖపట్నం రేంజ్ ఐజిపి, గోపీనాథ్ జట్టి, ఐపిఎస్* *ప్రధాన మంత్రి పర్యటనలో భాగంగా హెలిప్యాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్ స్థలంను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన విశాఖపట్నం రేంజ్ ఐజి* ప్రధాన మంత్రి పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపడుతున్నామన్న జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* బందోబస్తు, భద్రత విధులు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బంది నిర్వహించే విధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి దిశా నిర్దేశం చేసిన విశాఖపట్నం రేంజ్ ఐజిపి, గోపీనాథ్ జట్టి, ఐపిఎస్* ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవానికి ఆగస్టు 1న విచ్చేస్తున్న సందర్భంగా క్షేత్ర స్థాయిలో సభా వేదిక, పార్కింగ్, ప్రజా రవాణా, కాన్వాయ్ వెళ్లే మార్గాలను మరియు భద్రత, బందోబస్తు ఏర్పాట్లను విజయనగరం ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్, మరియు ఇతర పోలీసు ఉన్నతాధికారులతో విశాఖపట్నం రేంజ్ ఐజిపి, గోపీనాథ్ జట్టి,ఐపిఎస్ గారు జులై 20న పర్యవేక్షించి, అధికారులకు భద్రత పరమైన సూచనలు చేసారు. అనంతరం విశాఖపట్నం రేంజ్ ఐజిపి, గోపీనాథ్ జట్టి, ఐపిఎస్ బందోబస్తు, భద్రత విధులు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బందితో సమావేశమై, నిర్వహించాల్సిన విధులు, తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తల గురించి వివరించారు. జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ గారు రూట్ మ్యాప్ ను ప్రెజంటేషన్ ద్వారా పోలీసు అధికారులకు వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పర్యటనలో భాగంగా ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్, ప్రజా వేదికను సందర్శించి, నిర్మాణ పనులను, ఏర్పాట్లను పరిశీలించి, సంబంధిత అధికారులకు విశాఖపట్నం రేంజ్ ఐజిపి, గోపీనాథ్ జట్టి, ఐపిఎస్ పలు సూచనలు చేసారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వాహనాల పార్కింగ్ విషయంలో ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘాను పటిష్టం చేసి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. బందోబస్తును సెక్టార్లుగా విభజించి బహిరంగ సభకు హాజరయ్యే ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం రేంజ్ ఐజిపి, గోపీనాథ్ జట్టి, ఐపిఎస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎస్పీ కే. మహేశ్వర రెడ్డి, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా, విజయనగరం అదనపు ఎస్పీలు, డిఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, ఇతర అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహణ