న్యాయ మూర్తులకు, న్యాయ వాదులకు, కోర్టు స్టాఫ్ కి నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో జిల్లా న్యాయ సేవా సంస్థ (DLSA), బార్ అసోసియేషన్, సుఖీభవ హాస్పిటల్ మరియు పుష్పగిరి ఐ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడుతోంది.

ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ప్రిన్సిపాల్ జడ్జి శ్రీమతి M. బబితా గారు మాట్లాడుతూ ఈ మెగా వైద్య శిబిరాన్ని అందరూ వినియోగించుకోవాలి, మన శరీరంలో ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ముందే తెలుసుకొని, ఆ సమస్య ను అరికట్టాలని, ఆరోగ్యమే మహా భాగ్యం అని, ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి అని, ప్రతి ఒక్కరు మన జీవన విధానంలో యోగ, మెడిటేషన్ ఒక భాగంగా ఉండాలని కోరారు.

ఈ వైద్య శిబిరంలో సాధారణ వైద్య పరీక్షలు, కంటి పరీక్షలు, రక్తపోటు, మధుమేహ పరీక్షలు, అవసరమైన వైద్య సలహాలు మరియు తగిన చికిత్సకు సంబంధించిన మార్గదర్శకాలు ఉచితంగా అందించబడతాయి. కంటి సంబంధిత సమస్యలు ఉన్న వారికి ప్రత్యేకంగా నేత్ర పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి తదుపరి చికిత్సపై సూచనలు ఇవ్వబడతాయి. బ్లడ్ డొనేట్ క్యాంపు కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో గౌరవనీయులైన శ్రీమతి K. విజయకళ్యాణి గారు, మొదటి శ్రేణి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, గౌరవనీయులైన B. అప్పలస్వామి గారు, కుటుంబ న్యాయ స్థానం మరియు మూడవ అదనపు జిల్లా న్యాయ మూర్తి, గౌరవ M. శ్రీధర్ గారు స్పెషల్ జడ్జి ఫర్ ట్రయిల్ అఫ్ కేసు అండర్ SC, ST act మరియు నాల్గవ అదనపు జిల్లా న్యాయ మూర్తి, గౌరవ శ్రీ G.దుర్గయ్య, PLAPUS జడ్జి,గౌరవ శ్రీ మురళి కృష్ణ, ఐదవ అదనపు జిల్లా జడ్జి,గౌరవ శ్రీ Dr. A. కృష్ణ ప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జి మరియు కార్యదర్శి జిల్లా న్యాయ అధికార సంస్థ, విజయనగరం, గౌరవ రమేష్ నాయుడు గారు, సీనియర్ సివిల్ జడ్జి విజయనగరం, గౌరవ శ్రీ M. శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి, గౌరవ NS HR తేజా చక్రవర్తి, మొదటి శ్రేణి జ్యూడిషల్ ఫస్ట్ క్లాస్ మేజిష్టరేట్, గౌరవ కుమారి బుజ్జి గారు, మొబైల్ కోర్టు న్యాయ మూర్తి, గౌరవ శ్రీమతి శ్రీవిద్య, excise కోర్టు న్యాయ మూర్తి, గౌరవ శ్రీ బెల్లనా రవి గారు, member of high court Bar council, నలితం రమేష్,ప్రెసిడెంట్ విజయనగరం BAR అసోసియేషన్, ఇతర సీనియర్ జూనియర్ న్యాయవాదులు, కోర్ట్ సిబ్బంది,సుఖీభవ హాస్పిటల్ మరియు పుష్పగిరి ఐ హాస్పిటల్ డాక్టర్స్ పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి