పెదబోరబంద గ్రామంలో మీ భూమి- మీ హక్కు కార్యక్రమంలో ప్రభుత్వ రాజముద్రతో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి సంధ్యారాణి భూ వివాదాలు లేకుండా స్పష్టమైన భూహక్కులు కల్పించడం కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యం అని మంత్రి సంధ్యారాణి అన్నారు.పెదబోరబంద పంచాయతీలో పెదబోరబంద 807, లక్ష్మీపురం 39, పెదపదం 70, మొత్తం 916 పాసుపుస్తకాలు లబ్ధిదారులకు అందజేశారు.గత ప్రభుత్వంలో అడ్డగోలుగా జరిపిన ఆక్రమణ భూమి సమస్యలను పరిష్కరించి రాజముద్రతో కూడిన పాస పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం ఇది రైతులకు వరం అని,కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదే నని గత ప్రభుత్వంలో సర్వే రాళ్లపై ఫోటోలకు 700 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేసిందని గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆస్తులను తాకట్టుపెట్టి జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మీరందరూ కోరిన విధంగా పావురాయి గెడ్డను త్వరలోనే పూర్తిచేసి మీకు బహుమతిగా ఇచ్చి రైతులందరూ కళ్ళలో ఆనందం చూడటమే మా లక్ష్యమని మంత్రి సంధ్యారాణి అన్నారు. Spread the love టపా నావిగేషన్ గుమ్మలక్ష్మీపురం ఆశ్రమ పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ 4.0