సాలూరు పట్టణంలో పెద్ద హరిజన పేటలో గుమ్మడం ప్రాంతం లో మన్యం జిల్లా కలెక్టర్ మరియు ఐసిడిఎస్ పిడి ఆదేశాల మేరకు సాలూరు ఐసిడిఎస్ సిడిపిఓ సత్యవతి గారి ఆధ్వర్యంలో ఆడపిల్లలని రక్షించు ఆడపిల్లలని చదివించు అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిడిపిఓ మాట్లాడుతూ ఆడపిల్లలకు విద్య ఆరోగ్యం పోషణ అనేది ముఖ్యమైన అంశాలని ఆడపిల్లలను చదివించి వారిని ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లే బాధ్యత తల్లిదండ్రులదేనని అలా కాకుండా బాల్య వివాహాలు చేసి పిల్లల జీవితాలని పాడు చేయవద్దని సూచించారు. ఆడపిల్లలకు బాల్యవివాహాలు చేస్తే తల్లిదండ్రులతో పాటు చేసుకున్న వారిపై క్రిమినల్ కేసులు పడతాయని బాల్యవాలు చేయడం సహత్య నేరమని ఈమె సూచించారు అంతేకాకుండా లింగ వివక్షత చూపడం చట్టరీత్యా నేరమని సమాజంలో ఆడవాళ్లకు ఉన్న స్థానాన్ని కించపరచడం అని నేటి ప్రపంచంలో మగవాళ్ళకు దీటుగా అన్ని రంగాల్లో ఆడవాళ్లు ఉండేలా తల్లిదండ్రుల ప్రోత్సహించాలని దయచేసి ఆడవాళ్లను వంటింటికే పరిమితం చేయకుండా తల్లిదండ్రులు మంచి విద్యాబుద్ధులు నేర్పి వాళ్ల ఆరోగ్యాన్ని పరిరక్షించి ఉన్నత స్థానానికి ఎదిగేలా సమాజంలో గుర్తింపు తెచ్చుకునేలా తల్లితండ్రులు చేయాలని ఇది వాళ్ళ బాధ్యతని ఆమె తెలిపారు. అంతేకాకుండా ఆడపిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకొని మంచి పౌష్టికాహారం అందించి రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యల నుంచి వాళ్లను దూరం చేసే బాధ్యత తల్లిదండ్రులదేనని కళా జాతర అనే. కార్యక్రమం ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రమణమ్మ మరియు ,విజయ,సుధారాణి,గౌరీ, సునీత, మాధవి, జాన్సి,పాల్గొన్నారు