విజయనగరం, చీపురుపల్లి నియోజకవర్గం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు చీపురుపల్లి లో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు, చీపురుపల్లి జనసేన పార్టీ ఇంచార్జి విసినిగిరి శ్రీనివాసరావు అన్నారు, పుట్టినరోజు సందర్భంగా చీపురుపల్లి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర గంటల లోపు కార్యక్రమాలు నిర్వహించాలని తలపెట్టాము అని మీడియా సమావేశం లో తెలియజేసారు. ఉదయం తొమ్మిది గంటలకు పార్టీ కార్యాలయం నుండి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం వరకు ర్యాలీ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు, అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్ల పంపిణీ. దాని తరువాత మూడు రోడ్లు జంక్షన్ లో కేక్ కటింగ్ అనంతరం పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు వారితో వీడియో కాన్ఫరెన్స్. యువజన విభాగం కమిటీ ప్రకటన, సాంగ్ రిలీజ్ జరుగుతుంది అని తెలియజేసారు. Spread the love టపా నావిగేషన్ గరివిడి పంచాయితీ సిబ్బంది కీ లోపలికి రాకుండా గేటుకు ఫ్లెక్స్ కట్టి సమ్మె చేస్తున్న పారిశుద్ధ కార్మికులు,