📰 9 NEWS ప్రత్యేక కథనం సాలూరులో భగవాన్ విశ్వకర్మ యజ్ఞోత్సవ వేడుకలు ఘనంగా సాలూరు: సాలూరు పట్టణంలో భగవాన్ విశ్వకర్మ యజ్ఞోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. విశ్వకర్మ భగవానుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు, యజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులు ఆధ్యాత్మిక వాతావరణంలో వేడుకలను జరుపుకుంటున్నారు. విశ్వకర్మ భగవానుడిని సృష్టి, నిర్మాణం, శిల్పకళకు ఆద్యుడిగా భావించే విశ్వకర్మ సమాజ ప్రజలు ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తి, ఆధ్యాత్మికత, సంప్రదాయాల కలయికగా సాలూరులో విశ్వకర్మ యజ్ఞోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. 19వ తేదీ శనివారం నాడు ఆలయ ప్రాంగణం నుంచి సాలూరు పురవీధుల్లో స్వామివారి విగ్రహాన్ని మేల తాళాలతో తీసుకొని వెళ్లి నిమజ్జన ఉత్సవం జరుపుతా మని శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మరియు జ్ఞాన సరస్వతి దేవి ఆలయ భక్త బృందం తెలిపారు. శ్రావణ్ కుమార్ 9 NEWS | సాలూరు Spread the love టపా నావిగేషన్ యువత లక్ష్యాలే రాష్ట్ర భవిష్యత్‌కు పునాది.. విద్యార్థులతో మంత్రి సంధ్యారాణి ముఖాముఖి సేవే సందేశం.. రక్తదానమే సంకల్పం