*మాజీ మంత్రి, ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్వంత నియోజకవర్గం లో మూకుమ్మడి రాజీనామాలు* చీపురుపల్లి నియోజకవర్గం లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి నాలుగు మండలాల నాయకులు మాజీ ఎంపీటీసీ లు, జడ్పీటీసీ లు వార్డ్ మెంబెర్లు మూకుమ్మడి రాజీనామా చేయడం జరిగింది. చీపురుపల్లి జడ్పీటీసీ వలిరెడ్డి శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ మజ్జి శ్రీనివాసరావు నాయకత్వం లో అయన వెంట నడుస్తాం తప్ప పదవులకు ఆశపడి రావడం లేదు అని చెప్పడం జరిగింది. మెరకముడిదాం మండలం బూర్లే నరేష్ మాట్లాడుతూ మేము వ్యాపారం కోసమే కాంట్రాక్టు కోసమే కాదు అని తెలియజేయడం జరిగింది. చీపురుపల్లి మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ సుధారాణి, కొండపాలెం మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ ప్రమీల, ఎక్స్ ఆర్ ఈ సి ఎస్ డైరెక్టర్ వలిరెడ్డి లక్ష్మణ్ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ మాజీ చైర్మన్ గవిడి వాసుదేవరావు, ఆర్ ఇ సి ఎస్ మాజీ డైరెక్టర్ కుర్రోతు వెంకటరమణ మరియు నాలుగు వందల కుటుంబాలు మూకుమ్మడి రాజీనామా చెయ్యడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో లో సీనియర్ నాయకులు మాజీ మినిస్టర్ ప్రతిపక్ష నేత ఇలాకాలో వరుస రాజీనామాలు వైస్సార్సీపీ పార్టీ మరియు బొత్స సత్యనారాయణ కి ఇది కోలుకోలేని దెబ్బ, దీనిని ఏవిధంగా ఎదురుకుంటారో వేచిచుడాలి. Spread the love టపా నావిగేషన్ కోనేట్లో స్నానానికి వెళ్లి ముగ్గురు చిన్నారుల మృతి చీపురుపల్లి శాసన సభ్యులు గౌరవ శ్రీ కిమిడి కళావెంకట రావు గారి సమక్షంలో.. టీడీపీ లో చేరిన సుమారు 200 కుటుంబాలు.