చీపురుపల్లి నియోజకవర్గం గల గరివిడి నందు వున్నా పశువైద్య కళాశాలలో ఈరోజు జాతీయ సేవా పథకంలో భాగంగా ఉచిత దంత వైద్య శిబిరం, స్థానిక పశు వైద్య కళాశాలలో అసోసియేట్ డీన్ డా, మక్కెన శ్రీను వారి అధ్యక్షతన జరుపబడినది. వారు ఈ కార్యక్రమమును ఉద్దేశించి మాట్లాడుతూ “ఆరోగ్యమే మహా భాగ్యం” అనే నానుడిని క్రమం తప్పకుండా పాటిస్తూ విద్యార్థినీ విద్యార్థులు తమ దంత సమస్యలను గూర్చి తెలుసుకుని తగు చికిత్సలకై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన దంత వైద్యులు, డా, పి, నవీన్ మాట్లాడుతూ దంతాల ఆరోగ్యం మరియు పరిరక్షణ గురించి విపులంగా విశదీకరించారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రోజుకు రెండు సార్లు తమ దంతాలను శుభ్రం చేసుకోవడం ద్వారా దంతాలలో నిలిచిన హానికరమైన ఆహార పదార్థాలు తొలిగిపోయి దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుందని తద్వారా శరీర ఆరోగ్యం కూడా బాగుంటుంది అని చెప్పారు. గరివిడి పశు వైద్యకళాశాల యాజమాన్యం వారు ఈ విధమైన ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ శిబిరంలో 200 మంది విద్యార్థినీ విద్యార్థులు, బోధన మరియు బోధనేతర సిబ్బంది తమ దంతలను పరీక్ష చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల జాతీయ సేవా పథకం అధికారులు డా. కె. ప్రకాశ కుమార్, డా, ఇక్బాల్ హైదర్, డా. షేక్ మస్తాన్ మరియు ఒ.యస్,ఏ, డాక్టర్ కె. సుధారాణి పాల్గొన్నారు.