*₹1.50 లక్షల ఆర్థిక సహాయం అందించిన కోట్ల రఘు, చెల్లుబోయిన నర్సింహారావు* ఇటీవల గణపతి నవరాత్రుల సందర్భంగా జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గుడివాడ సత్యనారాయణ–సత్యవతి దంపతుల కుమారుడు గుడివాడ గోవిందు ప్రస్తుతం తిరుమల మెడికల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. గోవిందు వైద్యానికి లక్షల రూపాయలు ఖర్చవుతున్న నేపథ్యంలో, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి మానవతా దృక్పథంతో పలువురు ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పూసపాటి రేగ మండల జనసేన పార్టీ సీనియర్ నాయకులు కోట్ల రఘు స్పందించి, తన వంతు బాధ్యతగా ₹50,000 ఆర్థిక సహాయాన్ని గోవిందు కుటుంబానికి అందజేశారు. తిరుమల మెడికల్ హాస్పిటల్‌కు వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, చికిత్సకు అవసరమైన సహాయం అందించడం ద్వారా కోట్ల రఘు తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. అదేవిధంగా భోగాపురం మండల జనసేన పార్టీ సీనియర్ నాయకులు, CNR Ventures అధినేత చెల్లుబోయిన నర్సింహారావు కూడా గోవిందు కుటుంబ పరిస్థితిని తెలుసుకుని స్పందించారు. ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందించి, కుటుంబానికి అండగా నిలిచారు. పేద కుటుంబానికి చెందిన బాలుడు ప్రాణాపాయ పరిస్థితుల్లో చికిత్స పొందుతున్న సమయంలో రాజకీయాలకు అతీతంగా మానవతా కోణంలో స్పందించి, తమ వంతు సహాయాన్ని అందించిన కోట్ల రఘు, చెల్లుబోయిన నర్సింహారావులను పలువురు అభినందిస్తున్నారు. ప్రజా సమస్యలపై స్పందించడమే కాకుండా, ఆపదలో ఉన్న సామాన్య కుటుంబాలకు అండగా నిలవడం ద్వారా జనసేన నాయకులు ప్రజలతో తమ అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే నాయకత్వమే నిజమైన ప్రజా నాయకత్వం అనే భావనకు ఈ ఇద్దరు నాయకుల సహాయం ఒక మంచి ఉదాహరణగా నిలిచింది. Spread the love టపా నావిగేషన్ తండ్రి బాటలో కొడుకు… కామన్వెల్త్లో అజయ్ బాబు సిల్వర్ సంచలనం