కనకమాలక్ష్మి అమ్మవారికి సారి సమర్పించిన భక్తులు

చీపురుపల్లి

విజయనగరం జిల్లా,
చీపురుపల్లి పట్టణంలో  కొలువుదీరిన కనక మహాలక్ష్మి అమ్మవారు ను తమ ఆడపడుచు గా భావించి భక్తులు సారె సమర్పించుకుంటారు ఆషాడ మాసంలో ఈ సారె ను భక్తులు అందజేస్తారు. ఈ రోజు శ్రావణమాసం శుక్రవారం పట్టణంలో  ఆలయ కమిటీ చైర్మన్ ఇప్పిలి సూర్యప్రకాష్ (గోవిందా), వైస్ చైర్మన్ సూరు కుమార్ ఆలయ కార్య నిర్వహణ అధికారి జి. శ్రీనివాసరావు ఆ మరియు కమిటీ సభ్యుల అర్చకులు రవి శర్మ ఆధ్వర్యంలో భక్తులు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకున్నారు అనంతరం తమ వెంట తీసుకొచ్చిన పూలు, పండ్లు, సారె, గాజులు అమ్మకు సమర్పిస్తారు.  గ్రామ మహిళలు కనకమహాలక్ష్మి అమ్మకు ఆషాడం సారె అత్యంత వైభవోపేతంగా తీసుకోనివచ్చారు.  డప్పు వాయిద్యాలతో పూలు,పండ్లు, సారె, గాజులు తీసుకొని సంబరంగా సారె సమర్పించినారు
గతేడాది సైతం ఇలాగే అమ్మవారికి సారె తీసుకెళ్లామని భక్తులు తెలిపారు. ఈ సందర్బంగా అమ్మవారుని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలుచేసిన చీపురుపల్లి జడ్పీటీసీ ప్రతినిధి వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, అతని వెంట శివాలయం డైరక్టర్ ప్రభాత్ కుమార్, కోసూరు సుధాకర్ బాబు, డబ్బాడ ఆనంద్ కుర్మాకిరణ్ ఈ సందర్బంగా వలిరెడ్డి మాట్లాడుతూ ఆషాడ మాసంలో   అమ్మవార్లకు, గ్రామ దేవతలను భక్తుల తమ ఆడపిల్లలు వలె భావించి సారే సమర్పిస్తారు. అమ్మవారిని శాంతింప చేసి  సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండి రైతులు, ప్రజలు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ అమ్మకు వీటిని సమర్పిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రాజెక్టులు నిండుగా కళకళలాడాలని వారు ఆకాంక్షించారు. మందిరంలో పూజలు చేసిన అనంతరం అమ్మవారికి సారే తీసుకొని మేల తాళాల నడుమ కాలినడకన బయల్దేరి వెళ్లారు. ప్రత్యేకంగా  మహామండపంలో అమ్మవారుకు భక్తులుచే లలితసహస్రనామం, కుంకుమ పూజలు అర్చకులు జరిపించారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *