కొరియా ప్రాంతం లో హైటెన్షన్

కొరియా గ్రామాల్లో ఓటు హక్కు కోసం గిరిజనుల పట్టుదల.. సరిహద్దుల్లో ఇరు రాష్ట్రాల పోలీసుల మోహరింపు!

పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు:

2026 స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉన్న సరిహద్దు గ్రామాల్లో ఎన్నికల నిర్వహణ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. సాలూరు నియోజకవర్గ పరిధిలోని కొరియా ప్రాంతం లో గల 21 గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణల మధ్య, వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల్లో ఒడిశా పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా ప్రాంతంలో భద్రతను పర్యవేక్షిస్తూ గిరిజనులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా చర్యలు చేపడుతున్నారు

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల సందర్భంగా గిరిజనులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా భద్రత కల్పిస్తామని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు .

తమ గ్రామాలకు రాకపోకల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఎన్నికల్లో ఓటు వేయకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని కొందరు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాము ఆంధ్రప్రదేశ్ పరిధిలోనే కొనసాగుతామని, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే స్థానిక ఎన్నికల్లో ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకుంటామని సంబంధిత గ్రామాల గిరిజనులు స్పష్టం చేశారు.

మొత్తంగా, సరిహద్దు గ్రామాల్లో ఎన్నికల నిర్వహణ, గిరిజనుల ఓటు హక్కు, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సరిహద్దు వివాదం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సంబంధిత అధికారులు సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి