సాలూరు యువ అడ్వకేట్ గొర్లె.కిరణ్ కుమార్ గారికి మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారి చేతుల మీదుగా వైసీపీ సభ్యత్వ గుర్తింపు కార్డు
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సాలూరు యువ అడ్వకేట్*
సాలూరుకు పట్టణానికి చెందిన ప్రముఖ సీనియర్ అడ్వకేట్ గొర్లె.రామక్రిష్ణ గారి తనయుడు యువ న్యాయవాది గొర్లె.కిరణ్ కుమార్ గారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ గుర్తింపు కార్డును *మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ గిరిజన సంక్షేమ శాఖా మాత్యులు శ్రీ పీడిక.రాజన్నదొర* గారు తన చేతుల మీదుగా అందజేశారు. వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న గొర్లె.కిరణ్ కుమార్ గారికి ఈ గుర్తింపు కార్డు అందజేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సాలూరు ప్రాంతానికి చెందిన యువ న్యాయవాదిగా వృత్తిపరమైన బాధ్యతలను నిర్వర్తిస్తూనే,వైసీపీ న్యాయ విభాగంలో రాష్ట్రస్థాయి బాధ్యతలు చేపట్టడం విశేషం.పార్టీ లీగల్ సెల్లో జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్న కిరణ్ కుమార్ గారు న్యాయపరమైన అంశాల్లో తన వృత్తి నైపుణ్యాన్ని వినియోగిస్తూ పార్టీ న్యాయ విభాగం కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్నారు.
మాజీ ఉపముఖ్యమంత్రి రాజన్నదొర గారి చేతుల మీదుగా పార్టీ సభ్యత్వ గుర్తింపు కార్డు అందుకోవడంతో సాలూరుకు చెందిన యువ న్యాయవాది గొర్లె.కిరణ్ కుమార్ గారి పేరు మరోసారి స్థానికంగా చర్చనీయాంశమైంది.

