జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో శ్రీ పైడితల్లమ్మకు పట్టువస్త్రాల సమర్పణ

ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లమ్మ అమ్మవారి పండగ సందర్భంగా జిల్లా ఎస్పీ *శ్రీ ఎఆర్ దామోదర్, ఐపీఎస్ గారు* అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం, దేవాదాయ అధికారులు ఆలయ సంప్రదాయం ప్రకారం జిల్లా ఎస్పీ గార్కి పట్టు వస్త్రం, తీర్థ, ప్రసాదాలను, వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు.

జిల్లా ఎస్పీ *శ్రీ ఎఆర్ దామోదర్, ఐపీఎస్ గారు* మాట్లాడుతూ –

అమ్మవారి కృపా, కటాక్షాలు పోలీసుశాఖతోపాటు, ప్రజలందరిపైనా ఉండాలని, ప్రజలు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవించాలని, శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తూ జిల్లా పోలీసుశాఖ తరుపున ప్రప్రదంగా పట్టు వస్త్రాలు సమర్పించామన్నారు.

ముఖ్య ఘట్టమైన అమ్మవారి సిరిమానోత్సవం ఆర్నబ్ తుఫాను వలన ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సజావుగా సాగాలని అమ్మవారిని ప్రార్థించినట్లుగా తెలిపారు.

జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తూ, అందుకు తగిన ఏర్పాట్లను చేపట్టిందన్నారు.

భక్తుల సహకారంతో సిరిమానోత్సవం సాయంత్రం 5గంటలకే ముగిసే విధంగా చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ *శ్రీ ఎఆర్ దామోదర్, ఐపీఎస్ గారు* తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ఎస్.లక్ష్మణమూర్తి, ఆర్.గోవిందరావు, ఎస్.రాఘవులు, ఈ.కోటిరెడ్డి, పలువురు సిఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి