మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.. జీవితాన్ని ఆనందంగా గడపాలి!

డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం – SSWAASA ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం

యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎంచుకోవాలని ఎస్‌ఎస్‌డబ్ల్యూఏఏఎస్ఏ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ డాక్టర్ బి. అనితా జ్యోతి పిలుపునిచ్చారు.
(Arrow) పారామెడికల్ వొకేషనల్ జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
మత్తు పదార్థాల వినియోగం వ్యక్తి ఆరోగ్యాన్నే కాకుండా కుటుంబ సభ్యుల జీవితాలను, సమాజ భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తుందని ,యువతలో డ్రగ్స్ వినియోగంపై అవగాహన పెంపొందించి, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఎస్‌.ఎస్‌.డబ్ల్యూ.ఏ.ఏ.ఎస్ఏ (SSWAASA) ఫౌండేషన్ నడుస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా (SAY NO TO DRUGS) – డ్రగ్స్ వద్దు.. జీవితం ముద్దు అనే నినాదంతో యువతకు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరించేలా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు.

మత్తు పదార్థాల వినియోగం వల్ల మెదడు పనితీరు, శారీరక ఆరోగ్యం, మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం పడటమే కాకుండా కుటుంబ సంబంధాలు, సామాజిక జీవనం కూడా దెబ్బతింటాయి. ముఖ్యంగా విద్యార్థులు, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని అనితా జ్యోతి పిలుపునిచ్చారు.

మత్తు మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది.. మనశ్శాంతిని దూరం చేస్తుంది అనే సందేశంతో ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

జీవితాన్ని ఎంచుకోండి.. డ్రగ్స్‌ను కాదు.. ఇదే ఈ కార్యక్రమం అందించే ప్రధాన సందేశం.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి