RTI జై ఆంధ్రా జై భారత్ సమాచార హక్కుల సంఘం 6వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళ గౌరవ అధ్యక్షురాలు,ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవ అధ్యక్షురాలు, మన్యం జిల్లా జనరల్ సెక్రెటరీ
శ్రీమతి s. లక్ష్మీ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు
ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు సంఘం చేపడుతున్న సేవా కార్యక్రమాలు, సమాచార హక్కు చట్టం అమలు, ప్రజల్లో చట్టంపై అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత గురించి ప్రస్తావించారు.
ఏపీ ఆర్టిఐ ఇన్ఫర్మేషన్ కమిషనర్ శ్రీ పి .ఎస్ .నాయుడు ,g .కొండలరావు రిటైర్డ్ iis అధికారి ,జై ఆంధ్ర సమాచార హక్కు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి వెంకటనారాయణ ,వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బి.హెచ్ సుమిత్రా నందన్, మరియు జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి శ్రీమతి పల్లవి, మరియు రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి ఎస్ మల్లేశ్వరి, మరియు రాష్ట్ర అధ్యక్షురాలు అనిత, మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు.
వేడుకల్లో భాగంగా సంఘం ప్రతినిధులను సత్కరించడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు ప్రముఖులు, సంఘం ప్రతినిధులు, సభ్యులు, మహిళలు, పాల్గొన్నారు.
ఆరు సంవత్సరాలుగా సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సంఘం చేస్తున్న కృషిని పలువురు అభినందించారు.




THE 9 NEWS TELUGU
నిజం… మా లక్ష్యం.