మామిడితోటలో పేకాట ఆడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసుల రైడ్
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.,
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలతో మామిడి తోటలో పేకాట ఆడుతున్న వారిపై రైడ్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు
22మందిని అదుపులోకి తీసుకొని, రూ.1,23,860/-ల నగదు, 24 మొబైల్స్, 15 బైక్లు సీజ్ చేసిన పోలీసులు*
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన బుదరాయవలస పోలీసులు*
విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం బుదరాయవలస పోలీసు స్టేషను పరిధిలోని పెద పూతికవలస గ్రామ శివార్లలోని మామిడి తోటలో పేకాట ఆడుతున్న వారిపై టాస్క్ఫోర్స్ పోలీసులు రైడ్ చేసి, పేకాట ఆడుతున్న 22మందిని అదుపులోకి తీసుకొని, తదుపరి చర్యల నిమిత్తం బుదరాయవలస పోలీసులకు అప్పగించినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆగస్టు 20న తెలిపారు. జిల్లా ఎస్పీ గార్కి వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ సిఐ అశోక్ కుమార్, ఎస్సైలు సాగర్ బాబు, రామారావు ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరకముడిదాం మండలం పెదపూతికవలస గ్రామ శివార్లలోని మామిడి తోటలో పేకాట ఆడుతున్న వారిపై రైడ్ చేసి, పేకాట ఆడుతున్న 22 మందిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి బెట్టింగులకు వినియోగిస్తున్న రూ. 1,23,860/-ల నగదును, 24 మొబైల్ ఫోన్లు, 15ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని, తదుపరి చర్యల నిమిత్తం బుదరాయవలస పోలీసులకు అప్పగించారు. బుదరాయవలస ఎస్ఐ విచారణ చేపట్టి, పేకాట ఆడిన 22మందిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసామని జిల్లా ఎస్పీ తెలిపారు. చట్ట విరుద్ధంగా పేకాటలు, గుండాటలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ హెచ్చరించారు.