వైయస్సార్ కి ఘన నివాళి

చీపురుపల్లి
సంక్షేమ ప్రదాత అభివృద్ధి విధాత వైయస్సార్ గారికి ఘననివాళి – జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనువాసరావు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్
సంక్షేమ ప్రదాత అభివృద్ధి విధాత వైయస్సార్ ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నది ఐదేళ్ల మూడు నెలలే కానీ మంచి మనసుంటే ప్రజలకు ఎంత మేలు చేయవచ్చో ఆ కొద్ది కాలంలోనే నిరూపించారు భౌతికంగా దూరమైన ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఈరోజు 15వ వర్ధంతి సందర్భంగా చీపురుపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం అవర్ణలో మండల వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇప్పిలి అనంతం, జిల్లా వైస్సార్సీపీ కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు ఆధ్వర్యంలో ముఖ్య అతిధులుగా విజయనగరం జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ మరియు జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు మజ్జి శ్రీ శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, సీనియర్ నాయకులు కె. వి. సూర్యనారాయణ రాజు, మాజీ జడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు,  ఎంపీపీ ఇప్పిలి వెంకటనరసమ్మ, వైస్ ఎంపీపీ ప్రతినిధులు పతివాడ రాజారావు,  కరిమజ్జి శ్రీనివాసరావు నాయుడు, మేజర్ సర్పంచ్ మంగళగిరి సుధారాణి శ్రీనివాసరావు, బెల్లాన వంశీకృష్ణ, మండల నాయకులుతో కలిసి వైస్సార్ విగ్రహం నకు పువ్వులు దండలు వేసి, జోహార్ వైస్సార్ అంటూ నినాదాలు చేస్తూ
ఘన నివాళులర్పించారు

ఈ సందర్బంగా మాట్లాడుతూ….
పాదయాత్రతో కాంగ్రెస్ కు జీవం పోశారు
వరస ఓటములతో 2003 నాటికి కాంగ్రెస్ జీవచ్ఛాముల మారిన తరుణంలో వైయస్సార్ ఉమ్మడి రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా చేవేళ్ళ నుంచి ముందు టెండలో 2003 ఏప్రిల్ 9న ప్రజాప్రస్థావన పాదయాత్ర ప్రారంభించారు మండుటెండలో 1475 కిలోమీటర్లు నడిచారు పాదయాత్రతో కాంగ్రెస్కి జీవం పోసి 2004లో ఇటు ఉమ్మడి రాష్ట్రంలో అటు కేంద్రంలోని అధికారంలో తెచ్చారు 2004 మే 14న సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వేదికపై నుంచే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా ఫైల్ పై తొలి సంతకం చేసి 1100 కోట్ల వ్యవసాయ బకాలను మాఫీ చేశారు దాదాపు 35 లక్షలకు పైగా పంపు చెట్లకు ఉచిత విద్యుత్ అందించారు
2004 మే 14 నుంచి 2007 జూన్ 26 వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 168.52 కోట్లను వైయస్సార్ విడుదల చేశారు అనంతరం ఉచిత కార్పొరేట్ వైద్యాన్ని అందించేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు 108 104 సర్వీస్ ను ప్రారంభించారు ఆయన తెచ్చిన ఫీజు రివర్మెంట్ పదకొండు లక్షలాది పేద విద్యార్థులకు మేలు జరిగింది జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం తాడేపల్లిగూడెంలో ఉద్యాన యూనివర్సిటీ, తిరుపతిలో పశు వైద్య కళాశాల, హైదరాబాదులో ఐఐటి ఏర్పాటు చేశారు ఇరుకులపాయ నూజివీడు వద్ద ట్రిపుల్ ఐటీను నెలకొల్పారు. జల యజ్ఞం ద్వారా ఒకేసారి 86 ప్రాజెక్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఆయన హయాంలో ఐదేళ్లలో 23.49 లక్షల ఎకరాలకు నీరు అందించేలా 41 ప్రాజెక్టులు పూర్తి చేశారు గంగవరం కృష్ణపట్నం కాకినాడ పోర్ట్ లను నిర్మించారు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు
ఇప్పటికే ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో  గత ఐదు సంవత్సరాలలో సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు
ప్రజలకు మాయ మాటలు చెప్పి మోసం చేసిన కూటమి ప్రభుత్వం వైపు ప్రజల ఆశించి మొగ్గు చూపారు
కూటమి  ప్రభుత్వం ఏర్పడి నుండి రాష్ట్రంలో అరాచక పాలన, మహిళలపై అనేక దాడులు, విద్యార్థులకు నాసిరకమైన, కలుస్థా ఆహారంతో అనేక మంది ప్రాణాలు పోయి అనేక మంది విద్యార్థులు ఆరోగ్య సమస్యలు ఏర్పడ్డాయి, వైరస్ జ్వరాలతో అల్లాడుతుంది, అని ఎద్దేవా చేశారు
ఈ కార్యక్రమం లో మండలం లో వైస్సార్సీపీ నాయకులు, సర్పంచ్ లు బెల్లాన త్రినాధ, రఘుమండ త్రినాథ, మీసాల వెంకటరమణ, చందక గురునాయుడు, కోరాడ నారాయణ రావు, కోరాడ పృథ్వి,  బాణాన శ్రీను, పనస అప్పారావు, రేవళ్ళ సత్తిబాబు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు చైర్మన్ ఇప్పిలి సూర్యప్రకాష్, సొసైటీ ప్రెసిడెంట్లు, డైరక్టర్స్ ఎంపీటీసీలు, వార్డు మెంబెర్స్, ముఖ్యనాయకులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *