విజయనగరం జిల్లా చీపురుపల్లి సమీపం లో రామలింగపురం
పుర్రెయవలస గ్రామాల మధ్యలో స్వయంభూ గా వెలసిన శ్రీశ్రీశ్రీ మానసా దేవి నాగశక్తి అమ్మ వారు .
వివరాల్లోకి వెళ్తే పిన్నింటి వారి కలలోకి వెళ్లి భూ గర్భలో ఉన్నానని నన్ను వెలికితీసి గుడి కట్టమని చెప్పగా అమ్మవారి చెప్పిన విదంగా వారి సొంత పొలంలో 2019 లోగుడి కట్టించి ప్రత్యేక పూజలు అందిస్తున్నారు. భారతదేశంలో కేవలం రెండు చోట్ల మాత్రమే ఈ మానసా దేవి అమ్మవారు వెలసిందని మొదటిగా హరిద్వార్ లో స్వయంభుగా ఉన్నారని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చీపురుపల్లి ప్రాంతంలో మానసా దేవి నాగశక్తి స్వరూపిణిగా వెలసారని ఈ అమ్మవారికి ప్రతి మంగళవారం మరియు శుక్రవారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఈ పూజల కోసం రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వస్తూ ఉంటారని అర్చకులు తెలిపారు. అమ్మవారిని కలుసుకొని కోలుచుట్టు 27 ప్రదక్షిణాలు చేస్తే కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయని అమ్మవారికి అభిషేకించిన పసుపు కుంకుమ అక్షింతలు తీసుకొని వెళ్ళి నివాస స్థలాల్లో వ్యాపార స్థలాల్లో పంట పొలాల్లో ఉంచితే శుభం కలుగుతుందని ఈ నమ్మకంతో వేలాదిగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారని ఆలయ నిర్వహకులు తెలిపారు