బాధిత కుటుంభానికి 5లక్షల రూపాయల చెక్కు

*_అచ్చుతాపురం ఘటన బాధితుడు కీ, శే, జవ్వాది పార్ధశారది కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయాన్ని అందచేసి ఆదుకున్న వైసిపి పార్టీ_*

బాధిత కుటుంభానికి 5లక్షల రూపాయల చెక్కును అందచేసిన ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, పార్టీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్తు రాజు, మాజీ ఎమ్మెల్యే శ్రీ అలజంగి జోగారావు గారు, పార్టీ ప్రజా ప్రతినిదులు.

విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్జ్ లో గల ఫార్మా కంపెనీలో ఇటీవల జరిగిన ప్రమాదంలో మరణించిన భాదితులు అందరికీ వైయస్సార్ పార్టీ రాష్ట్ర అధినేత మాజీ సిఎం శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు అండగా నిలిచేందుకు ఒక్కరికి 5లక్షల రూపాయల చెప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించి అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు పార్వతీపురం మండలం డోకుసీల పంచాయతీ, చెలంవలస గ్రామానికి చెందిన బాధితుడు కీ, శే, జవ్వాది పార్ధశారది కుటుంబాన్ని నేడు పరామర్శించిన ఉమ్మడి జిల్లా వైసీపీ పార్టీ పెద్దలు జడ్పీ చైర్మన్ శ్రీ మజ్జి శ్రీనివాసరావు గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీ పీడిక రాజన్నదోర గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ ఏస్ పరీక్షిత్ రాజు గారు, స్థానిక మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు గారు సమక్షంలో పార్టీ ముఖ్య నాయకులతో కలిసి కుటుంబానికి అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పార్టీ పెద్దలు మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఘటనలో మరణించిన పార్థసారథి గారిని తిరిగి తీసుకురాము అని ఐతే బాధ్యత కుటుంబానికి అండగా నిలవాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి గాను ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని పార్టీ తరఫున అందజేసి ఆదుకోవడం జరుగుతుందని ఈ క్రమంలో నేడు చాలా వలస గ్రామానికి విచ్చేసి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నియోజకవర్గ ప్రజా ప్రతినిదులు, నాయకులు, పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *