ఈ రోజు నెల్లిమర్ల నియోజకవర్గం శాసనసభ్యురాలు మరియు జనసేన పార్టీ చీఫ్ విప్ శ్రీమతి లోకం నాగ మాధవి గారి ఆధ్వర్యంలో జరిగిన భారీ చేరుకల్లో భాగంగా ప్రముఖ రాజకీయ నేత మరియు మాజీ డిసిసిబి వైస్ చైర్మన్ శ్రీ చనమల్లు వెంకటరమణ గారితో పాటుగా ఆయన అనుచరవర్గమైనటువంటి ముఖ్యంగా నెల్లిమర్ల మండల పంచాయతీ సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, సొసైటీ డైరెక్టర్లు మరియు నెల్లిమర్ల నగర పంచాయతీ కౌన్సిలర్ల తో పాటుగా సుమారు 3000 కుటుంబాలతో భారీ ఎత్తున వైసీపీ నుండి జనసేనలోకి చేరడం జరిగిన సందర్భంగా ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఉమ్మడి విజయనగరం జిల్లా కో- ఆర్డినేటర్
రాష్ట్ర ప్రచార కమిటీ
శ్రీ కోట్ల కృష్ణ గారు