చీపురుపల్లి నుండి నేపాలకు బయలుదేరిన హరికృష్ణ


చీపురుపల్లి
*చెట్లను కాపాడండి నీటిని కాపాడండి భూమి తల్లిని రక్షించండి* అంటూ సైకిల్ పై ప్రచార యాత్రకు (చీపురుపల్లి నుండి నేపాల్)కు బయలుదేరిన హరికృష్ణకు  ప్రత్యేక అభినందనలు తెలిపిన  *చీపురుపల్లి మండల వైసీపీ నాయకులు*
గరివిడి మండలం, కే పాలవలస గ్రామమునకు చెందిన వ్యవసాయ రైతు కుమారుడు డిగ్రీ వరకు విద్యా వాసం చేసిన కోట్టేడ హరికృష్ణ *సేవ్ ట్రీ – సేవ్ ఎర్త్* నినాదంతో చీపురుపల్లి గ్రామ దేవత అయిన శ్రీ కనకమాలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర నుండి సైకిల్ పై బయలుదేరి నేపాల్ వరకు ప్రచార యాత్ర కొనసాగుతుంది నేపథ్యంలో అల జంగి వద్ద  ఎంపీపీ ప్రతినిధి మరియు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇప్పిలి అనంతం, జడ్పిటిసి ప్రతినిధి మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాస నాయుడు మరియు వైసీపీ నాయకులు హరికృష్ణ  అభినందించి నీకు ఈ ప్రచారంలో ఏటువంటి అవసరం ఉన్న మాకు ఫోన్ చేయవలసిందిగా ఫోన్ నెంబర్ ఇచ్చారు హరికృష్ణ మాట్లాడుతూ చెట్లను కాపాడండి నీటిని కాపాడండి భూమి తల్లిని రక్షించండి ప్రజలలో మార్పు తేవడం కోసం భూమి విలువ మరియు చెట్లు విలువ తెలియపరుస్తూ ప్రతి గ్రామంలో ప్రచారం చేస్తూ  సేవ్ ఎర్త్… భూమిని కాపాడండి అని అర్థం. పర్యావరణ పరిరక్షణ కోసం కృషిచేస్తూ, వేల సంఖ్యలో మొక్కలు ప్రజలు తో నాటే విధంగా తమ యాత్ర కొనసాగుతుందని తెలియపరిచారు
ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి మరియు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇప్పిలి అనంతం, జడ్పిటిసి ప్రతినిధి మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాస నాయుడు,
అలజంగి సర్పంచ్ రఘుమండ త్రినాథ,  మెట్టపల్లి మాజీ సర్పంచ్ చందక శ్రీనివాసరావు,  ఎంపీటీసీ మీసాల ఈశ్వరావు, రామలింగాపురం మాజీ సోసైటీ అధ్యక్షులు రేవల్ల సత్తిబాబు, మాజీ ఎంపీటీసీ, చింతాడ లక్ష్మణ, మీసాల అప్పలనాయుడు,  బవిరి రవి,  డి.రాము, ప్రభాత్ కుమార్, బొంతు తిరుపతి, కిషోర్, డబ్బాడ ఆనంద్,  వెంకీ, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *