చీపురుపల్లి నియోజకవర్గం
చీపురుపల్లి మండలం
పేరిపి గ్రామం
*ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న చీపురుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ *శ్రీ కిమిడి కళా వెంకటరావు*
ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మేరకు ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల ముందుకు వస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని ఎమ్మెల్యే గౌరవ శ్రీ కళా వెంకటరావు రావు గారు మాట్లాడుతూ “ఇది మంచి ప్రభుత్వం” ఇచ్చిన హామీలను ప్రాధాన్యత ఒక్కొక్కటి అమలు ఇందులో భాగంగా ఇప్పటికే పెన్షన్, అన్నా క్యాంటీన్లు, రైతు ధాన్యం బకాయిలు వంటి కార్యక్రమాలను అమలు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏర్పడిన తొలి 100 రోజుల్లోనే ‘ఇది మంచి ప్రభుత్వం!” అని ప్రజల చేత అనిపించుకుంటోందన్నారు. ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో లబ్ధిదారులకు వాటి ప్రయోజనాలను అందజేస్తూ ధైర్యంగా నేడు వారి ఇంటి ముందుకే వెళుతున్నామని ఆయన అన్నారు. గత ప్రభుత్వం మాదిరి గా కాకుండా పింఛన్లు ఒకేసారి రూ.1000 పెంచి రూ.4 వేలు ఇవ్వడం ఒకటైతే, మొదటి నెల ఒక్కొక్కరికీ రూ.7000లు చొప్పున ఒకేరోజు 65.18 లక్షల మందికి ఇంటింటికీ వెళ్లి రూ.4,408 కోట్లు పంపిణీ చేయడం దేశ చరిత్రలోనే ఒక అధ్యాయమని ఆయన పేర్కొన్నారు. రైతులకు ధాన్యం కొనుగోలులో బకాయి పెట్టి వెళ్లిన గత ప్రభుత్వ బకాయిలను రూ.1674.47 కోట్ల చెల్లించి అన్నదాతను ఆదుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మెగా డీఎస్సీ ద్వారా 25 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో నిర్వీర్యం చేసిన గ్రామ పంచాయతీలకు నిధులను మంజూరు చేస్తూ పటిష్టపరుస్తున్నామన్నారు. గత ప్రభుత్వం కుంటి సాకులు చెబుతూ అన్యాయంగా అర్హులైన వారికి కూడా పెన్షన్ ఇవ్వలేదని, అటువంటి వారిని గుర్తించే వారి అర్హత మేరకు పెన్షన్లు అందించే కార్యక్రమాలు చేపడతామన్నారు.
పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5 రూపాయలతోనే ఆకలి తీర్చే 175 అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఏర్పడి గడిచిన వంద రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నెరవేర్చిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళుతున్నామన్నారు. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సుపరిపాలన అందించాలని దిశగా పనిచేస్తున్నాయన్నారు. గత ప్రభుత్వం ఒకవైపు ఆర్థిక సహాయం అందిస్తూ మరోవైపు దానికి రెండింతలు టాక్స్ ల రూపంలో వసూలు చేసే వారిని పేర్కొన్నారు. దీనివలన ప్రజల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడేది అని తెలిపారు. ప్రభుత్వం చెత్త మీద పన్నును తీసివేసింది అన్నారు. భవన నిర్మాణ కార్మికులందరికీ మేలు జరగాలని ఉచిత ఇసుక విధానం ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. రాబోయే దివాళి నాటికి ఇచ్చిన హామీలు మరొక పధకం అయిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని అమలు చేయనున్నామన్నారు. ప్రజా ప్రయోజనాలు కోరుతూ ప్రభుత్వం అందించే పథకాలు ప్రజలకు తెలియజేసే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రజల ఆకాంక్షలకు, అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆ దిశగా సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని గౌరవ కళా వెంకటరావు గారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చీపురుపల్లి మండల కూటమి నాయకులు ఎక్స్ సర్పంచులు ఎక్స్ ఎంపిటిసి లు ప్రజలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.