పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేస్తున్న జనసేన పార్టీ

పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేస్తున్న జనసేన పార్టీ

*MLA శ్రీమతి లోకం నాగ మాధవి గారితో మర్యాదపూర్వకంగా భేటీ అయిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీ బాబు పాలూరు గారు మరియు పార్టీలోకి చేరబోయే జిల్లాలోని పలువురు నాయకులు*

బొబ్బిలి, పార్వతీపురం మరియు కురుపాం నియోజకవర్గాలలో జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేస్తున్న జనసేన పార్టీ నాయకులు, జనసైనికులతో కలిసి మన జనసేన పార్టీ సిద్ధాంతాలు మరియు మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పరిపాలనా దక్షత మెచ్చి అతి త్వరలో జనసేన పార్టీలోకి చేరబోయే జిల్లాలోని పలువురు నాయకులను MLA, చీఫ్ విప్ శ్రీమతి లోకం మాధవి గారికి పరిచయం చేసిన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీ బాబు పాలూరు గారు. శ్రీమతి లోకం మాధవి గారు మాట్లాడుతూ కురుపాం నియోజకవర్గం నుంచి అక్షయ కన్స్ట్రక్షన్స్ MD శ్రీ ఏగిరెడ్డి తిరుపతి నాయుడు గారు, రిటైర్డ్ CI శ్రీ అలుబిల్లి విశ్వేశ్వరరావు గారు, రిటైర్డ్ AO శ్రీ వావిలపల్లి చంద్రశేఖర్ గారు మరియు వారి సహచర నాయకత్వం, కార్యకర్తలు, పార్వతీపురం నియోజకవర్గం నుంచి స్టార్ మండి రెస్టారెంట్ MD శ్రీ గుసిడి రామారావు గారు, శ్రీ వావిలపల్లి రామ్మోహన్ రావు గారు మరియు వారి సహచరులు, బొబ్బిలి నియోజకవర్గం నుంచి మాజీ వైసిపి యూత్ కన్వీనర్ శ్రీ నేమాపు వెంకటేష్ గారు మరియు అతని అనుచరులు అందరికీ అతి త్వరలోనే కండువాలు కప్పి జనసేన పార్టీలోకి సాదరంగా ఆహ్వనిస్తామని ఇంకా చాలా మంది పెద్ద నాయకులు ఈ 3 నియోజకవర్గాల నుంచి మా బాబు పాలూరు మరియు నాయకులకు టచ్ లో ఉన్నారని, పార్టీకి వారి బయోడేటాలు ఇచ్చి పార్టీ అనుమతితో వారిని కూడా పార్టీలోకి ఆహ్వానిస్తామని తెలియజేసారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి