ఘనంగా తెలుగు జర్నలిస్ట్స్ ఫోరం (టీజేఎఫ్) దీపావళి సంబరాలు
హాజరైన జిల్లా కలెక్టర్ అంబేద్కర్
సుమారు వంద మంది జర్నలిస్టులకు దీపావళి కానుకల పంపిణీ
జర్నలిస్టులకు అన్ని విధాలా అండగా ఉంటామన్న కలెక్టర్
విజయనగరం
జిల్లాలో పనిచేస్తోన్న వర్కింగ్ జర్నలిస్టులకు అండగా ఉండి, వారి సంక్షేమానికి సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ డా. బి.ఆర్ అంబెడ్కర్ అన్నారు. తెలుగు జర్నలిస్ట్స్ ఫోరం ఆధ్వర్యంలో బుధవారం ఎస్.వి.ఎన్ లేక్ ప్యాలెస్ హోటల్ లో దీపావళి సంబరాలు వైభవంగా నిర్వహించారు. టీజెఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎం.ఎం.ఎల్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ అంబెడ్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ….జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ప్రభుత్వ నిబంధనల మేరకు అందజేసేందుకు కృషి చేస్తామన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలుగు జర్నలిస్టుల ఫోరం ఇటువంటి కార్యక్రమాలు చేయడం శుభపరిణామం అని, ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించడానికి మా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారి డి.రమేష్ మాట్లాడుతూ…జర్నలిస్టుల సంక్షేమం కోసం టీజేఎఫ్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. టీజేఎఫ్ మరిన్ని కార్యక్రామలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఫోరం అధ్యక్షులు ఎం.ఎం.ఎల్.నాయుడు మాట్లాడుతూ టీజేఎఫ్ ఆధ్వర్యంలో గడచిన ఐదేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. టీజేఎఫ్ ఆధ్వర్యంలో తొలిసారి జిల్లాలో నిర్వహించిన దీపావళి సంబరాల కార్యక్రమం ద్వారా జర్నలిస్టులకు దీపావళి కానుకలు అందజేయడం ఆనందకరంగా ఉందన్నారు. మున్ముందు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టనున్నామని అందుకు జర్నలిస్టుల సహకారం ఎంతో అవసరమని చెప్పారు. కాగా, కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో పనిచేస్తోన్న సుమారు వంద మంది జర్నలిస్టులకు దీపావళి కానుకలను కలెక్టర్, డిపిఆర్వో చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో ఫోరం ప్రధాన కార్యదర్శి జి.గోపాల్ తదితరులు పాల్గొన్నారు.