వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా ముఖంగా పోలీసులపై చేసిన వ్యాఖ్యలను చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు ఖండించారు
చీపురుపల్లిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కళావెంకటరావు గురువారం మీడియాతో మాట్లాడారు.
మాజీ సి ఎం జగన్ మోహన్ రెడ్డి అసహనంకు గురై పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు
ప్రజాస్వామ్యంపై నమ్మకం లేక నియుంత్రత్వంలో పుట్టి, పెరగడం జగన్ మోహన్ రెడ్డి కి ఆనవాయతీగా వచ్చింది
అందులో భాగంగా తాను మళ్ళీ అధికారం లోకి రాగానే సప్త సముద్రాలు దాటి ఉన్నాసరే పోలీసులను వదిలేది లేదని ఇవాళ మీడియా ముఖంగా మాట్లాడారన్నారు
వైసీపీ అధినేత తాటాకు చప్పుళ్లకు ఏపీ పోలీసులు, రెవెన్యూ అధికారులు భయపడరని తెలియజేసారు
అసెంబ్లీ లోకి వెళ్తే మైకు ఇవ్వడం లేదని చెబుతూ మీడియా లో జగన్ మెహన్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు
23 మందితో ఎమ్మెల్యేలతో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు , అప్పటి ప్రతిపక్షనేతగా అసెంబ్లీ కి ధర్జాగా వచ్చి ప్రజా సమస్యలపై పోరాటామ్ చేసారని గుర్తు చేశారు
ఇద్దరు ఎంపీలతో అటల్ బీహారీ వాజపేయ్ పార్లిమెంట్ కి వెళ్లి ప్రతిపక్ష పాత్ర వహించారన్నారు.
ప్రజా స్వామ్యంకోసం , లా ఎండ్ ఆర్డర్ కోసం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడం అనేది దెయ్యాలు వేదాలు వర్ణించినట్టు ఉందని వ్యాఖ్యానించారు
గత అయిదేళ్ళుపాటు అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డి చేసిన వీరవిహంగం గుర్తు కోచ్చే ఆయన అసెంబ్లీకి వచ్చి మాట్లాడటం లేదన్నారు
ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన నియుంతృత్వ పోకడలను వీడి, ప్రజాస్వామ్యానికి,శాసన వ్యవస్థ, న్యాయవ్యవస్థలకు కట్టుబడి ఉండాలని హితవు పలికారు
అలాగే చీపురుపల్లి నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వం కార్యక్రమం జోరుగా సాగుతుందని ఎమ్మెల్యే కళావెంకటరావు తెలిపారు