విజయవాడ లో వాలంటీర్ల సదస్సును భగ్నం చేసే ప్రయత్నాలు మానుకోవాలి. ఎన్నికల సందర్భంగా మహాకూటమి నేతలు ఇచ్చినటువంటి హామీ ప్రకారం వాలంటీర్లకు వెంటనే ఉద్యోగ అవకాశ కలిపించి కనీస వేతనం 10,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి ఆధ్వర్యంలో విజయవాడ సదస్సుకు సిద్ధమవుతున్న వాలంటీర్సును అలాగే మన్యం జిల్లా ఎఐటియుసి ఉపాధ్యక్షులు బలగా రాదను ఈరోజు సాలూరు పోలీసుల హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా బలగా రాధా మాట్లాడుతూ సామాన్య ప్రజలకు సుధూర ప్రాంతాల్లో ఉన్న వారికి చెరువుగా ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించిన వాలంటీర్లను నిర్దక్షిణంగా తొలగించడం అన్యాయమని వాలంటీర్లు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని ఎన్నికల సందర్భంగా చంద్రబాబు కుటుంబం ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరుతున్నారని న్యాయం చేయమని అడగడమే నేరంగా ఈరోజు ప్రభుత్వం పోలీసులు అక్రమరసులకు చేయడం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పెద్ద తేడా ఏమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు అక్రమ అరెస్టులకు భయపడేది లేదని వాలంటీర్లకు న్యాయం జరిగే వరకూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆమె తెలిపారు


 
             
                                         
                                        