చీపురుపల్లి వైస్సార్ పార్టీ ఆఫీస్ లో పత్రికా సమావేశం



చీపురుపల్లి వైస్సార్ పార్టీ ఆఫీస్ లో పత్రికా సమావేశం ”

*“రాష్టం లో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది”*
———————–
చీపురుపల్లి పట్టణం వైస్సార్ పార్టీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశం లో ఎంపీపీ ప్రతినిధి మండల వైస్సార్ పార్టీ అధ్యక్షులు ఇప్పిలి అనంతం ,జడ్పీటీసీ ప్రతినిధి, జిల్లా వైస్సార్ పార్టీ కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, టౌన్ ప్రెసిడెంట్ పతివాడ రాజారావు మాట్లాడుతూ సీనియర్ నాయకులు చీపురుపల్లి  ఎమ్మెల్యే( తెలుగుదేశం పార్టీ) కిమిడి కళావెంకటరావు గారు మా నాయకుడు వైస్సార్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వై యస్. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శలు చెయ్యడం విడ్డురంగా ఉంది అని కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలల కాలం అవుతుంది అని
ఈ దేశం లో ఎక్కడ లేని విదంగా ఈ రాష్ట్రంలో ప్రజల మీద ప్రతిపక్ష నాయకుల మీద దాడులు హత్య కాండ కొనసాగుతున్నాయి అని అన్నారు, ఆడవారు, పసిపిల్లలు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని 5 నెలల్లో అత్యధిక 91 హత్యాచారాలు మహిళలు, చిన్నపిల్లలు మీద ఎక్కవగా ఈ రాష్ట్రంలో జరిగాయి అని ఇది ప్రభుత్వం పాలనకు చేతకాని తనానికి నిదర్శనం అని అన్నారు,  ఈ రాష్ట్రము లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని అందుకే పోలీసులు కూడా ఏమి చెయ్యలేని నిశ్శహాయ స్థితి లో ఉన్నారు అని అన్నారు, మాజీ ముఖ్య మంత్రి వై యస్. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలకు ఎంతో మంచి చేసారు అని ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ పక్కాగా అమలు చేసి ప్రజలకి అందించారు అని తెలిపారు, కూటమి ప్రభుత్వం ఏర్పడి 6నెలల కాలం అయినప్పటికి సూపర్ 6 హామీలు అమ్మవోడి పధకం రాలేదు,రైతు భరోసా లేదు, ఫ్రీ బస్సు లేదు, 20 లక్షల ఉద్యోగాలు ఏమి అయ్యాయో చెప్పాలని అన్నారు, పోనీ మన నియోజకవర్గం లో చూసుకుంటే పరిపాలన అంత MLA PA చేస్తున్నాడు అని అధికారులకు ఆదేశాలు కూడా అతనే ఇస్తున్నాడు అని 6 నెలల పరిపాలనలో మీరు నియోజకవర్గం లో కొంత మంది డీలర్ లని తీసివేయ్యడం, కొంతమంది వెలుగు యానిమిటర్లని తొలగించడం 50 మంది వరకు వాటర్ వర్క్స్ లో పనిచేస్తున్న పంపు ఆపరేటర్స్ లను తొలగించడం తప్ప ఈ నియోజకవర్గం లో మీరు చేసింది సూన్యం, అని అన్నారు, జనం ఇటువంటి MLA ని ఎందుకు గెలిపించామా అని బాధపడుతున్న పరిస్థితి లో వున్నారు అని అన్నారు, వర్షాలు పడి కొంత వరకు రైతులకు పంటలు పండాయి తప్ప, తోటపల్లి నీరు కాలవలకి వోదలకపోవడం, అలాగే మేము చీపురుపల్లి CHC గవర్నమెంట్ హాస్పిటల్ ని 100 పడకలుగా అప్ గ్రేడ్ చేసి GO తెస్తే కనీసం అదికూడా మీరు చొరవ తీసుకొని చెయ్యలేకపోవడం మీ చేతకాని తనానికి నిదర్శనo కాదా అని ఏద్దేవా చేసారు, ఎంతసేపు కింది స్థాయి నాయకులు మాటలు విని డీలర్ లను, వెలుగు వివో లు, పంపు ఆపరేటర్ లాంటి చిరుద్యోగుల ను తొలగించి వారి పొట్ట కొట్టడం మానుకొని నియోజకవర్గం అభివృద్ధి మీద ద్రుష్టి పెట్టాలని తెలియజేస్తున్నాo అని అన్నారు.ఈ కార్యక్రమం లో వైస్సార్ పార్టీ నాయకులు ఎంపీపీ ప్రతినిధి ఇప్పిలి అనంతం,జడ్పీటీసీ ప్రతినిధి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు,టౌన్ ప్రెసిడెంట్ పతివాడరాజారావు, వైస్సార్ పార్టీ నాయకులు కోరుకొండ దాలయ్య, గవిడి సురేష్,రేవల్ల సత్తిబాబు,చింతాడ లక్ష్మణ,భవిరి రవిశంకర్,మీసాల కృష్ణ, ప్రభాత్, మురళి, నాగచైతన్య పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *