ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి రెవెన్యూ సదస్సుల కార్యక్రమాన్ని ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గం గులివిందాడ అగ్రహారం గ్రామంలో నిర్వహించి గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా వారి యొక్క భూ సమస్యలను వినతి రూపంలో అందించి వారి యొక్క సమస్యలను పరిష్కరించాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షులు రౌతు కామునాయుడు గారు, జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు గారు, జనసేన రాష్ట్ర ప్రచార కమిటీ ఉమ్మడి విజయనగరం జిల్లా కో-ఆర్డినేటర్ కోట్ల కృష్ణ గారు, తహసిల్దారు మరియు అధికారులు పాల్గొన్నారు.