అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో బి.టెక్ విద్యార్థులకు ప్రాంగణ ఎంపికలు

అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో బి.టెక్ విద్యార్థులకు ప్రాంగణ ఎంపికలు


స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీ లో సోమవారం ఉదయం హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీ నెక్సవో.ఏఐ హైదరాబాద్ వారు ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు.ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపాల్  డాక్టర్ వి.జాషువా జయప్రసాద్ గారు మాట్లాడుతూ ఈ ప్రాంగణ ఎంపికలకు బి.టెక్ అన్ని విభాగాలకు చెందిన విద్యార్థులు అర్హులని తెలిపారు.ఈ ప్రాంగణ ఎంపికలకు మన కాలేజీ విద్యార్థులుతో పాటు అవంతి విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులతో కలిపి మొత్తం 251మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు.ఈ సాఫ్ట్ వేర్ కంపెనీ ఏఐ అనుబంధ డిజిటల్ మార్కెటింగ్ తో పాటు విభిన్న అప్లికేషన్స్ సంబంధించిన సాఫ్ట్ వేర్ ను తయారుచేస్తుంది. అలాగే ఏఐ సహకారంతో స్టూడెంట్ మరియు టీచర్ అసెస్మెంట్ కు సంబంధించి సాఫ్ట్ వేర్ ని కూడా తయారు చేస్తుంది.ఈ ప్రాంగణ ఎంపికలు నెక్సవో.ఏఐ హెచ్.ఆర్ టీమ్ ఎమ్.రణదీప్ ఆపరేషన్స్ మేనేజర్,వి.మౌనిక ఏఐ డెవలపర్,కె.సునీల్ టెక్నికల్ మేనేజర్,పి.హర్షిత హెచ్ఆర్ ఆపరేషన్స్ వారు ఆధ్వర్యంలో విద్యార్థులకు బృంద చర్చలు,టెక్నికల్ పరీక్ష మరియు మౌఖిక పరీక్షలు నిర్వహించి 21 మంది విద్యార్థులను ఎంపిక చేశారు.వీరికి వార్షిక వేతనం 3 లక్షలు ఉంటుందిని తెలియచేసారు.ఈ ప్రాంగణం ఎంపికలు వైస్ ప్రిన్సిపల్ బి.వెంకటరమణ,ఏఓ జి.అనిల్ కుమార్,కాలేజ్ ప్లేస్మెంట్ అధికారి అభిలాష్ పర్యవేక్షణలో జరిగాయిని తెలిపారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి