సాలూరు నియోజక వర్గం,పాచిపెంట మండలం,రాయిగుడ్డి వలస గ్రామంలో ఎన్నికల ప్రచారం లో భాగం గా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీడిక రాజన్నదొర పర్యటించారు. గతంలో టిడిపి నాయకులు ఎప్పుడైనా గిరిజన గ్రామాలకు వచ్చి ఇక్కడ ప్రజలను కలిసి వారి బాగోగులు చూశారా ఎన్నికల సమయంలో మీ వద్దకు వచ్చి ఓట్ల కోసం మాయమాటలు చెబుతున్నారని వారు మాయ మాటలు నమ్మొద్దు అని అక్కడ ప్రజలందరికీ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరోసారి జగనన్నకు,నాకు అవకాశం ఇవ్వండి అని ప్రజలను కోరారు