పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజు



సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం 6 గంటల 30 నిమిషాలకు అమ్మవారి సుప్రభాత సేవ పంచామృత అభిషేకం శ్రీ వాసవి అమ్మవారి 102 గోత్రనామాలతో అమ్మవారికి కలశార్చన అనంతరం పుణ్యం నదులు జలాలతో అభిషేకించారు అమ్మవారికి బంగారు అలంకరించి లలితా సహస్రనామాలతో పాటు ఆలయ ప్రధాన దేవతల హోమాలు నవగ్రహ హోమాలు మహా పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు సాయంకాలం శ్రీ వాసవి మహిళలచే అమ్మవారికి భజన సంకీర్తన కార్యక్రమాలు దశరథ హారతులు ప్రసాదం వితరణ కార్యక్రమాలు చేశారు ఈ కార్యక్రమంలో శ్రీమతి శ్రీ మండవెల్లి సాంబశివరావు నాగమణి దంపతులు ,శ్రీమతి రేపాక అప్పల నాగేశ్వరరావు మరియు ధర్మపత్ని పద్మ కుమారి, శ్రీమతి ఇండుపూరి నారాయణరావు ధర్మపత్ని జయలక్ష్మి గార్లచే ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణంలో ఉన్న భక్తులందరూ పాల్గొన్నారు
