అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో మెగా జాబ్ మేళా

అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో మెగా జాబ్ మేళా

స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో గురువారం నాడు అనగా 20వ తేదీన ఉదయం కాలేజీ మరియు APSSDC విజయనగరం వారు సంయుక్తంగా మెగా జాబ్ మేళా నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ డాక్టర్ వి.జాషువా జయప్రసాద్ గారు తెలియజేశారు.ఈ మేరకు జాబ్ మేళాకి సంబంధించిన గోడ పత్రికను ఈ రోజు విడుదల చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో ఐటీ,ఫార్మా,ఆటోమొబైల్స్, మ్యానుఫ్యాక్చరింగ్,తదితర కంపెనీలకు సంబంధించిన సర్కిల్ ఐటి,మీరాకల్ సాఫ్ట్ వేర్ సిస్టమ్స్,కోజెంట్ ఈసర్వీసెస్ లిమిటెడ్,టావు డిజిటల్ ఇండియా పివిటి లిమిటెడ్,త్రిడ్జ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పివిటి లిమిటెడ్,హేటరో ల్యాబ్స్ లిమిటెడ్,డెక్కన్ ఫైన్ కెమికల్స్ పివిటి లిమిటెడ్,జయబేరి ఆటోమోటివ్స్,డైకిన్ ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా పివిటి లిమిటెడ్,అపోలో ఫార్మసీ,మెడ్ ప్లస్,ఎల్జి ఎలక్ట్రానిక్స్ ఇండియా పివిటి లిమిటెడ్ వంటి వివిధ 28 కంపెనీలకు జాబ్ మాల నిర్వహిస్తున్నట్లు తెలిపారు.కావున చీపురుపల్లి,గరివిడి,గుర్ల,మెరకముడుదాం,నెల్లిమర్ల,విజయనగరం,లావేరు,రాజాం తదితర ప్రాంతాల్లో ఎస్ ఎస్ సి, ఇంటర్,డిగ్రీ,ఐటీ,డిప్లొమా,బిటెక్,ఎంటెక్,ఎంబీఏ,ఎంసీఏ తదితర కోర్సుల్లో ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.పూర్తి వివరాల కోసం ఈ ఫోన్ నెంబర్లను 7989826953,7995691295,79972 19987 సంప్రదించవలసిందిగా కోరుచున్నాము.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ బి.వెంకటరమణ,ఏఓ జి.అనిల్ కుమార్,వివిధ విభాగాధిపతులు,కాలేజీ ప్లేసెమెంట్ అధికారి అభిలాష్ పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి