జాతీయస్థాయి సాంకేతిక ఉత్సవ లు

జాతీయస్థాయి సాంకేతిక ఉత్సవ లు

*అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా నిర్వహించిన జాతీయస్థాయి సాంకేతిక ఉత్సవ ప్రారంభ వేడుకలు*:
స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో బుధవారం ఉదయం “ఆటోస్-2k25” పేరుతో అవంతి విద్యా సంస్థల చైర్మన్ శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు అధ్యక్షతన జాతీయస్థాయి సాంకేతిక ఉత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ కె.చంద్రభూషణరావు ఈసీఈ విభాగం,డీఏపీ జేఎన్టీయూ గురజాడ, విజయనగరం నుండి విచ్చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు ఈ నాలుగేళ్లలో ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకొని సాంకేతిక నైపుణ్యతపై దృష్టి పెట్టాలని కోరారు.అలాగే విద్యార్థుల విద్యతోపాటు యోగ,ఫిజికల్ వ్యాయామం ద్వారా శారీరిక దృఢత్వాన్ని కూడా పెంపొందించుకోవాలని కోరారు.సుందర్ పిచాయ్ సత్య నాదెళ్ల వంటి సాంకేతిక నిపుణులను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కోరారు.గౌరవ అతిథిగా డాక్టర్ ఎమ్.పీ చక్రవర్తి ప్రొడక్షన్ మేనేజర్,షిప్ యార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం నుండి విచ్చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ విన్నూత ఆవిష్కరణలు చేయాలని కోరారు.విద్యార్థులు సృజనాత్మకతతో ఉద్యోగ,ఉపాధికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకొని అత్యున్నత స్థాయికి చేరుకోవాలని తెలిపారు.మరొక గౌరవ అతిథిగా జె.కుమార్ డైరెక్టర్ హెచ్.ఆర్ ఏషియన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్,విశాఖపట్నం నుండి విచ్చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వెలికితీయడానికి  ఇటువంటి సాంకేతిక ఉత్సవాలు ఎంతో దోహదం చేస్తాయని తెలిపారు. విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాన్ని అలవర్చుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.మరొక అతిథిగా డాక్టర్ కె.నాగసుమన్ ప్రొఫెసర్ మెకానికల్ విభాగం,ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం నుండి విచ్చేసారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు కాలంతోపాటు సాంకేతిక నైపుణ్యత పై అవగాహన పెంచుకోవాలని తెలిపారు.మరొక అతిథిగా డాక్టర్ కె.శ్రీకుమార్ ప్రొఫెసర్ ఎలక్ట్రికల్ విభాగం జేఎన్టీయూ  గురజాడ,విజయనగరం నుండి విచ్చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు అకాడమిక్ స్కిల్స్ తో పాటు టెక్నికల్ స్కిల్స్ ను కూడా నేర్చుకోవాలని తెలిపారు.ఈ సందర్భంగా రాష్ట్ర మాజీ మంత్రివర్యులు అవంతి విద్యాసంస్థల చైర్మన్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్,మిషన్ లెర్నింగ్,పైధాన్,జావా వంటి సాంకేతికత కన్నా మనిషి మేధస్సు ఎంతో గొప్పదని తెలియజేసారు. అలాగే ప్రతి విద్యార్థి సరైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని పాజిటివ్ అటిట్యూడ్, క్రమశిక్షణ,హార్డ్ వర్క్ అలవర్చుకుని వాటిని సాధించుకోవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ వి.జాషువా జయప్రసాద్ గారు మాట్లాడుతూ విద్యార్థులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్,పోస్టర్ ప్రెజెంటేషన్,ప్రాజెక్ట్ ఎక్స్పో మరియు హేకధాన్ వంటి సాంకేతిక పద్ధతుల ద్వారా విద్యార్థుల వారి యొక్క సాంకేతిక సామర్థ్యాన్ని ప్రదర్శించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో అవంతి విద్యా సంస్థల ప్రతినిధి ఎమ్.మహేష్,వైస్ ప్రిన్సిపల్ బి.వెంకటరమణ,ఏఓ జి.అనిల్ కుమార్,వివిధ విభాగాధిపతులు, ఉపాధ్యాయులు,విద్యార్థులు బోధనేతర సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి