కార్మిక వర్గ పోరాటాల వేగుచుక్క సిఐటియు 55వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాచిపెంట మండల కేంద్రం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో శ్రామిక మహిళా నేత సిఐటియు నాయకులు కొత్తకోట పార్వతీదేవి ఆధ్వర్యంలో పి ఐ టి యు జండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు హమాలీ కార్మికులు రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు శ్రామిక మహిళ నేత సిఐటియు నాయకులు కే పార్వతీదేవి మాట్లాడుతూ 1970 సంవత్సరంలో కొన్ని వందల మంది సభ్యులతో ఏర్పడిన సిఐటియు నేడు 65 లక్షల మందితో సభ్యులతో దేశంలో అత్యున్నత పోరాట స్ఫూర్తి కలిగి భారతదేశంలో మొనగాడుగా నిలిచిందని కొనియాడారు కిందిస్థాయిలో భవన నిర్మాణ కార్మికులకు ముఠా కళాశాల నుండి అత్యున్నతమైన ప్రభుత్వరంగ పరిశ్రమలు పనిచేస్తున్న ఉద్యోగుల వరకు అనేక రంగాల్లో కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం అసంఘటితనంగా కార్మికులందరినీ ఐక్యం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు వ్యతిరేకంగా కార్మిక వర్గానికి భద్రత కల్పించే విధంగా పోరాటాలను నడిపిందని అన్నారు అనేక నిర్బంధాలను ఎదుర్కోవడంలో మతసామరస్యాన్ని కాపాడేందుకు దేశ సమైక్యతను నిలబెట్టేందుకు సిఐటియు నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నదని వర్గ దృక్పథంతో నికరంగా కార్మికుల పక్షా నిలబడి చేస్తున్నటువంటి సిఐటియు కృషి అభినందనీయమని అన్నారు అలాంటి సిఐటియు ఆవిర్భావ దినం సందర్భంగా కార్మిక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు కార్మిక వర్గం ఎదుర్కొంటున్న తమ సమస్యలు పరిష్కారం కోసం కేంద్రంలో మోడీ అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను జూలై 9న జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు జాతీయ ఉద్యమ స్ఫూర్తితో బ్రిటిష్ కాలం నుండి అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్నటువంటి కార్మిక చట్టాల్ని కేంద్ర బిజెపి ప్రభుత్వం కాలరాస్తూ కార్పొరేట్లకు అంబానీ ఆదానీలకు కట్టబెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇటువంటి పరిస్థితుల్లో మొక్క వారదీక్షతో సిఐటియు నాయకత్వాన్ని కార్మికులంతా కూడా ఐక్యమై దేశ సంపదను కాపాడు కోవాలని కార్మిక చట్టాలను కాపాడుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులందరినీ కూడగట్టి ఐక్యంగా పోరాడాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆటో కార్మిక సంఘం నాయకులు పిన్నింటి రమేష్ వసంతరావు రైతు సంఘం నాయకులు బోను గౌరి నాయుడు హమాలీ కార్మిక సంఘం నాయకులు లంక గోవింద తదితరులు పాల్గొన్నారు జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు




