*ఐదు దశాబ్దాలుగా ఎన్నికల హామీగానే మిగిలింది
*కూటమి ప్రభుత్వాలు ప్రాజెక్టు పూర్తి చేసి, పూర్తిస్థాయిలో రైతులకు సాగునీరు ఇవ్వాలి*
*జంఝావతి సాధన సమితి అధ్యక్షులు చుక్క భాస్కర రావు
*జంఝావతి రబ్బరు డ్యామ్ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే… కాంగ్రెస్ ఇన్చార్జ్ బత్తిన మోహన్ రావు*
*జంఝా వతిని పూర్తి చేసేదెప్పుడు… ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
*జంఝావతి సాధన సమితికి సిపిఐ, గిరిజన సంక్షేమ సంఘం, సిపిఐ (ఎంఎల్) లిబరేషన్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి తదితరుల సంఘీభావం*
పార్వతీపురం:
పార్వతీపురం జిల్లా, కొమరాడ మండలం, రాజ్యలక్ష్మి పురం గ్రామ సమీపంలో గల జంఝావతి నదికి… జంఝావతి సాధన సమితి శుక్రవారం జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ సమితి అధ్యక్షులు చుక్క భాస్కరరావు, కార్యాచరణ కన్వీనర్ మరిశర్ల మాలతి కృష్ణమూర్తి నాయుడు, గౌరవ సలహాదారు శ్రీ భారతనంద స్వామీజీ, వర్కింగ్ ప్రెసిడెంట్లు సవరపు రామారావు, ఇవి నాయుడు, చీఫ్ అడ్వైజర్ జగన్నాథ్ ప్రసాద్ రాయగురు, ఉపాధ్యక్షులు ఈర్ల సంజీవ నాయుడు, చుక్క చంద్రరావు, వారణాశి శ్రీహరి, మాన్యం రామకృష్ణ, మంత్రపూడి వెంకటరమణ, కార్యాచరణ కో- కన్వీనర్లు జాగరపు ఈశ్వర ప్రసాద్, గవిరెడ్డి సత్య సింహ రఘు చక్రవర్తి, వంగల దాలి నాయుడు, కార్యదర్శులు తీళ్ళ గౌరీ శంకర్రావు, అట్టాడ రవికుమార్, పి రంజిత్ కుమార్, తదితరులతో కలసి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పార్వతీపురం నియోజకవర్గం ఇన్చార్జ్ బత్తిన మోహన్ రావు, సాలూరు నియోజకవర్గం ఇంచార్జ్ గేదెల రామకృష్ణ, సిపిఐ నాయకులు తోట జీవన్, గరుగుబిల్లి సూరయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు, సీపీఐ (ఎం.ఎల్) లిబరేషన్ పార్టీ నాయకులు పి. సంగం, ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ప్రతినిధులు చల్లారపు వెంకట నాయుడు, ఈశ్వరరావు మాస్టర్ తదితరుల సంఘీభావంతో జంఝావతి నదిలో జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జంఝావతి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో రైతులకు సాగునీరు అందించేలా దీవించాలని పసుపు, కుంకుమ, పూలతో గంగా మాతాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు చుక్క భాస్కరరావు మాట్లాడుతూ జంఝావతి ప్రాజెక్టు గత ఐదు దశాబ్దాలుగా ఎన్నికల హామీగానే మిగిలింది అన్నారు. ఇంతకాలం ఎన్నికల ముందు హామీ, ఎన్నికల తరువాత ఒడిశా వివాదం అనే నెపంతో నాయకులు నెట్టుకొచ్చారన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో, ఒడిశాలో, కేంద్రంలో బిజెపి కూటమి అనుకూల ప్రభుత్వాలు ఉండటంతో సమస్యను పరిష్కరించాలన్నారు. ఇకపై ఎన్నికల హామీగా జంఝావతిని మిగిల్చే పని కుదరదన్నారు. జంఝావతి పూర్తయితే ఈ ప్రాంతం వెనుకబాటుతనం పోతుందని, వలసలు తగ్గుతాయని కార్యాచరణ కన్వీనర్ మరిశర్ల మాలతి కృష్ణమూర్తి అన్నారు. జంఝావతి రబ్బరు డ్యామ్ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కి జంఝావతి ప్రాజెక్టు అంటే అమితమైన ఇష్టమన్నారు. ఆ పార్టీ నాయకులు బత్తిన మోహన్ రావు, గేదెల రామకృష్ణ అన్నారు. జంఝావతిని ఎప్పటికి పూర్తి చేస్తారో ప్రజలకు స్పష్టత నివ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు అన్నారు. రైతుల బాగోగులు కోసం పాలకులు దృష్టి సారించాలని సిపిఐ నాయకులు తోట జీవన్ అన్నారు. జంఝావతిని పూర్తి చేసి వలసలు నివారించాలని సిపిఐ ఈఎంఎల్ లిబరేషన్ పార్టీ నాయకులు పి. సంఘం కోరారు. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం విడనాడి జంఝావతిని పూర్తిచేయాలని గిరిజన సంక్షేమ సంఘం నాయకులు పి.రంజిత్ కుమార్ కోరారు. జంఝావతిని పూర్తి చేసేంతవరకు జంఝావతి సాధన సమితి పోరాడుతుందని నాయకులంతా స్పష్టం చేశారు. తక్షణమే ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. త్వరలో భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీలు, ఆయా సంఘాలకు చెందిన ప్రతినిధులు, సభ్యులు రైతులు పాల్గొన్నారు.


