ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకి,చిన్నారులకి రక్షణ లేదు జడ్పీటీసీ, మహిళా నేత వలిరెడ్డి శిరీష విమర్శలు చేసారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకనాటి బీహార్ రాష్ట్రం కన్నా ఘోరంగా లా అండ్ ఆర్డర్ తయారు అయింది అని చీపురుపల్లి జడ్పీటీసీ వైస్సార్ పార్టీ మహిళా నేత వలిరెడ్డి శిరీష అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు మీద, చిన్నారులు మీద జరుగుతున్న హత్యాచారాలు, హత్యలు చూస్తుంటే ఈ రాష్ట్రంలో పట్టపగలు మహిళలు బైటకు రావడానికి కూడా భయపడుతున్నారు అని అన్నారు, మహాత్మా గాంధీ గారు దేశంలో ఎప్పుడు అయితే మహిళలు అర్ధరాత్రి కూడా ఒంటరిగా స్వేచ్చగా తిరగ గలరో ఆరోజే ఈదేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు అని అన్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లలు కాలేజీకి, స్కూల్ కి పంపించడానికి చిన్నారులని ఆదుకోవడానికి కూడా తల్లి తండ్రులు భయపడే పరిస్థితితులు ఈ రాష్ట్రంలో ప్రస్తుతం వున్నాయి అని అన్నారు, రాష్ట్రంలో ఒక మహిళ హోమ్ మంత్రిగా ఉండి కూడా మహిళలు మీద ఈ విదంగా అకృత్యాలు, హత్యలు, దాడులు జరుగుతుంటే హోమ్ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ కనీసం ఒక్కసారి అయినా లా అండ్ ఆర్డర్ మీద పోలీస్ డిపార్ట్మెంట్ తో కనీసం సమీక్ష పెట్టిన పరిస్థితి లేదు కనీసం అంటువంటి సంఘటనలు మీద గట్టిగా స్పందించరు, అందుకే వైస్సార్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి గారి ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు మహిళలతో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలకి వినతిపత్రం సమర్పించడం జరిగింది, భారత దేశంలో సుమారు 29 రాష్ట్రాల్లో అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు జరుగుతుంటే కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుంది, అందుకే ఎవరు ఎటువంటి దుచ్చర్యలకి పాల్పడిన మహిళలు మీద దాడులు హత్యాచారాలు చేసిన వారు తెలుగుదేశం పార్టీ కి చెందినవారు అయితే వారి మీద కేసు లు వుండవు, ఆ ధైర్యం తోనే ఎక్కువగా మహిళలు, చిన్నారులు మీద ఇటువంటి దాడులు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కువగా జరుగుతున్నాయి అని అన్నారు, రాష్ట్రంలో అధికారం లో కి వచ్చి సంవత్సరం అవుతున్న అభివృద్ధి, మీదకాని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మీద కానీ దృష్టి పెట్టలేదు కానీ రాష్ట్రంలో వున్న పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రతిపక్ష నాయకులు మీద కక్షసాధింపు కేసు లతో బిజీ గా వున్నారు, రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ అనేది అమలు జరగడం లేదు అని అన్నారు, ప్రజలు అన్ని గమనిస్తున్నారు అని తగిన సమయం లో కూటమి ప్రభుత్వ్తానికి బుద్ది చెప్పడానికి సిద్ధంగా వున్నారు అని అన్నారు, రాష్ట్రంలో చేతకాని హోమ్ మంత్రిగా మిగిలి పోతారో ఇకనైనా ప్రతిపక్ష నాయకుల మీద కక్ష సాధింపులకు పోలీస్ డిపార్ట్మెంట్ ని ఉపయోగించుకోవడం ఆపేసి లా అండ్ ఆర్డర్ ని కఠినంగా అమలు చెయ్యాలని జడ్పీటీసీ, మహిళా నేత హితవు పలికారు.

