శివరాంపురం గ్రామం, సాలూరు మండలం
ప్రజల వద్దకే వెళ్లిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు.ప్రజల మద్దతుతో గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణం ఈ కార్యక్రమంలో పార్టీవర్గాలు, యువత, నాయకులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.సాలూరు మండలంలోని శివరాం పురం గ్రామంలో నిర్వహించిన “ఇంటింటికి తెలుగుదేశం – సుపరిపాలన కు తొలి అడుగు” కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వర్షాన్ని లెక్కచేయకుండా పాల్గొనడం విశేషం.తీవ్ర వర్షంలో తడుస్తూనే మంత్రివర్యులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకున్నారు. తమ కర్తవ్యం ముందుందనీ, ప్రజల బాగోగు లే ముఖ్యమన్న భావనతో వర్షాన్ని లెక్కచేయకుండా పాదయాత్ర కొనసాగించారు.









